Supreme Court: మన్మోహన్ సింగ్‌పై బొగ్గు గనుల కేసు మూసివేత
Supreme Court: బొగ్గుగనుల కేటాయింపు కేసులో దివగంత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు 2015లో ప్రత్యేక సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ క్రిమినల్ కేసును కొట్టివేస్తున్నట్లు ఇవాళ సుప్రీంకోర్టు పేర్కొన్నది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తాజా తీర్పునిచ్చింది.
న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటాయింపు కేసులో దివగంత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు 2015లో ప్రత్యేక సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ క్రిమినల్ కేసును కొట్టివేస్తున్నట్లు ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court) పేర్కొన్నది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్‌కు చెందిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఆ బెంచ్‌లో జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ వీ మోహన కూడా ఉన్నారు. ఈ కేసులో సీబీఐ తన క్లోజర్ నివేదికలో మన్మోహన్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ నివేదికను సుప్రీం ఆమోదించింది. ప్రముఖ ఆర్ధికవేత్త మన్మోహన్ సింగ్.. 2004 నుంచి 2014 వరకు భారత ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2024 డిసెంబర్ 26వ తేదీన ఆయన పరమపదించారు. దివంగత ప్రధాని తరపున న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. మన్మోహన్ మరణం తర్వాత ఆ కేసులో అప్పీల్ సాంకేతికంగా నిర్వీర్యం అయినట్లు న్యాయవాది సిబల్ పేర్కొన్నారు. మాజీ ప్రధాని పట్ల చేసిన వ్యాఖ్యలను కూడా తొలగించాలని ఆయన కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

