RS Praveenkumar | సెక్యూరిటి రివ్యూ అని సమావేశం పెట్టి పెద్ది సుదర్శన్ రెడ్డి గన్మెన్లను తొలగించారు. ఆయనకు థ్రెట్ ఉన్నది అని 25 సంవత్సరాల నుండే సెక్యూరిటీ ఉన్నది దీనిపై కోర్టుకు వెళ్లారు. కోర్టులో స్టే ఇచ్చారు. దీనితో వరంగల్ జిల్లా సీపీ వద్దకు వెళ్తే నాకు సంబంధం లేదు స్టేట్ ఇంటలిజెన్స్ వాళ్లు చూస్తారని చెప్పారు. పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర ఒత్తిడికి లోనయ్యారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. డీజీపీ నాకు కూడా ఒక్క నోటీస్ ఇచ్చారు. నీకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం తొలగిస్తున్నాం. సెక్యూరిటీ తగ్గిస్తున్నాం అని లేఖ రాశారు. ఏమైనా థ్రెట్ ఉంటే మాత్రానే సెక్యూరిటీ ఇస్తామని చెప్పారు. సరే బాగానే ఉన్నది మరి మైనంపల్లి హన్మంతరావు ఏం కూంబింగ్ ఆపరేషన్లు చేశాడని, ఏ తీవ్రవాద సంస్థ, ఏ మావోయిస్టులు ఆయనను టార్గెట్ చేశారని 2+2 సెక్యూరిటీ ఇచ్చారు..? అని ప్రశ్నించారు.
కొండా మురళీ ఎమ్మెల్సీ కాదు, కార్పొరేషన్ చైర్మన్ కాదు. ఆయనకు 2+2 సెక్యూరిటీ ఇచ్చారు.. ఆయనకు ఏ హోదా ఉందని 2+2 సెక్యూరిటీ ఇచ్చారు..? అనుముల తిరుపతి రెడ్డి, అనుముల కొండల్ రెడ్డి ఏం కూంబింగ్ ఆపరేషన్లు చేశారని, ఏ ఉగ్రవాద సంస్థతో ముప్పు ఉందని, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక సెమీ ఆటోమేటెడ్ వెపన్స్ ఇచ్చారు..? సునీతా మహేందర్ రెడ్డి మాజీ జెడ్పీ చైర్పర్సన్ వారికి కూడా గన్మెన్లను ఇచ్చారని అడిగారు. అనుములు తిరుపతి రెడ్డికి ఉన్న అర్హత ఏంటి..?పెద్ది సుదర్శన్ రెడ్డి లేని అర్హత ఏంటీ.. చెప్పాలన్నారు.
సత్యవతి రాథోడ్ తెలంగాణ రాష్ట్రంలో తొలి గిరిజన మహిళా మంత్రి.. ఆమె ఇప్పుడు మాజీ మంత్రి, మాలోతు కవిత మాజీ ఎంపీ.. వారి గన్మెన్లను తీసేశారు. జోగు రామన్న మాజీ మంత్రి ఆయన గన్మెన్లను తొలగించారు.. అదే జిల్లాలో ఇంద్రకరణ్ రెడ్డికి 2+2 గన్మెన్లను ఇచ్చారు ఎందుకు..? అని అడిగారు. కుందూరు జానారెడ్డి ప్రస్తుత హోదా ఏంటి..? ఆయనకు 2+2 గన్మెన్లను ఇచ్చి, అత్యాధునిక బుల్లెట్‌ప్రూఫ్ వాహనం ఇచ్చారు. జానారెడ్డి మాజీ మంత్రి అయితే సత్యవతి రాథోడ్, జోగు రామన్న కూడా మాజీ మంత్రులే కదా. మరి వీళ్లకు ఎందుకు సెక్యూరిటీ తొలగించారు..? బీఆర్ఎస్ నాయకులకు ఒక న్యాయం.. కాంగ్రెస్ నాయకులకు ఒక న్యాయమా..? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని ప్రశ్నించారు.
జగ్గారెడ్డికి ఏం చేశాడని గన్ మెన్ లను ఇచ్చారు..?
అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కు గన్మెన్లు ఇచ్చారు.. ఆయనకు ఏం ముప్పు ఉన్నది.కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ 3 సార్లు ఎమ్మెల్యే ఆయనకు భద్రత తొలగించారు. తల్లోజు ఆచారి ఎమ్మెల్యే కూడా ఆయనకు ఎందుకు ఇచ్చారు.. ఈశ్వరమ్మ యాదవ్ యాదాద్రి బోర్డు సభ్యులు సీనియర్ రాజకీయ నాయకురాలు పదవి స్వీకారం చేశారు. ఆమె పై శ్రీ చరణ్ రెడ్డి ఆమె అనేక మాటలు మాట్లాడారు. ఆయనకు గన్ మెన్లను ఇచ్చారు.
జగ్గారెడ్డికి ఎందుకు గన్ మెన్ లను ఇచ్చారు. ఏం చేశాడని గన్ మెన్ లను ఇచ్చారు. తూముకుంట నర్సారెడ్డికి ఎందుకు గన్ మెన్లను ఇచ్చారు.. ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు ఎందుకు ఇచ్చారు, అదే వినయ్ భాస్కర్ కు ఎందుకు ఇవ్వలేదు, నన్నపనేని నరేందర్‌కు లేదు. సెక్యూరిటీ రివ్యూ కమిటి అనేది లోపభూయిష్టమైన కమిటి. మిస్టర్ రేవంత్ రెడ్డి మీరు మాజీ ముఖ్యమంత్రి అయితే కూడా మీకు భద్రత తగ్గించరు
ఈ సెక్యూరిటీ రివ్యూ కమిటీని తొలగించండి.
సెక్యూరిటీ రివ్యూ కమిటి రిపోర్ట్ బయట పెట్టాలి ఫహిం ఖురేషి ,వాసవి బిల్డర్ కుట్ర బహిర్గతం కావాలి, దీనిపై పార్టీ సీరియస్‌గా తీసుకుంటుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తొలగించాలని హైకోర్ట్ ఆదేశాలు ఇస్తే డివిజన్ బెంచ్‌కు పోతాం అని చెప్పారో మేము కూడా అదే చెప్తున్నాం. బుల్లెట్ ప్రూఫ్ కార్లు అంటున్నావ్. కర్ణాటకలో, తమిళనాడులో మంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ కార్లు లేవు. నక్సల్స్ ప్రభావం లేని రాష్ట్రం తెలంగాణ అంటున్నారు కదా.. మరి బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఎందుకు మంత్రులకు..? దీనిపై కోర్టుకు వెళ్తాం….న్యాయ పోరాటం చేస్తాం. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరుతున్నామని డిమాండ్ చేశారు.
మైనంపల్లి హన్మంతరావు ఏం కూంబింగ్ ఆపరేషన్లు చేశాడని, ఏ తీవ్రవాద సంస్థ, ఏ మావోయిస్టులు ఆయనను టార్గెట్ చేశారని 2+2 సెక్యూరిటీ ఇచ్చారు?
కొండా మురళీ ఎమ్మెల్సీ కాదు, కార్పొరేషన్ చైర్మన్ కాదు. ఆయనకు 2+2 సెక్యూరిటీ ఇచ్చారు.. ఆయనకు ఏ హోదా ఉందని 2+2 సెక్యూరిటీ ఇచ్చారు?
ఏనుముల తిరుపతి… https://t.co/CU26pZe56U pic.twitter.com/N92g1V9zpv
— Telugu Scribe (@TeluguScribe) July 29, 2026
US Tariff Bill | అమెరికా రష్యాపై ఆంక్షల బిల్లు.. భారత్, చైనాలపై సుంకాల చిల్లు