గద్వాలలో బోల్తాపడిన ట్రావెల్స్ బస్సు.. 37 మంది విద్యార్థులకు తప్పిన ప్రాణాపాయం
జోగులాంబ గద్వాల జిల్లా బోరవెల్లి వద్ద ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. బస్సులో ఉన్న 37 మంది విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.
జోగులాంబ గద్వాల జిల్లాలో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. మానవపాడు మండలం బోరవెల్లి స్టేజి సమీపంలో 44వ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున తమిళనాడుకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే వారంతా స్వల్ప గాయాలతో బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది.
తమిళనాడులోని సేలం హోలీక్రాస్ ఇంటర్నేషనల్ స్కూల్కు చెందిన విద్యార్థులు హైదరాబాద్ వండర్లాకు విహారయాత్ర కోసం బస్సులో బయలుదేరారు. బోరవెల్లి వద్ద బస్సు వేగంగా వెళ్తుండగా అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పెద్ద ప్రమాదం తప్పడంతో విద్యార్థులు, వారి వెంట ఉన్నవారు ఊపిరిపీల్చుకున్నారు. గాయపడిన విద్యార్థులను చికిత్స కోసం అలంపూర్ చౌరస్తాలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
Obsession | రూ.2500 కోట్లకు పైగా వసూళ్లు.. ఓటీటీలోకి రాబోతున్న ‘అబ్సెషన్ అన్కట్ వెర్షన్’
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

