Mission Bhagiratha | గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇంటింటికి తాగునీరందించే లక్ష్యంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథను చేపట్టి.. విజయవంతంగా అమలు చేశారని తెలిసిందే. అయితే కాంగ్రెస్ పాలనలో మాత్రం మిషన్ భగీరథ ఫలాలు జనాలకు అందడం లేదు. ఇందుకు తాజా ఘటనే ఓ ఉదాహరణ. అసమర్థ కాంగ్రెస్ పాలనలో తాగునీటి కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మహిళలు, గ్రామస్తులు ఏకమై తమకు తాగునీరు రావడం లేదంటూ నిరసన గళమెత్తారు.
నాగర్ కర్నూల్ జిల్లా కోడేర్ మండలం ఎత్తం గ్రామంలో రెండు నెలలుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని మహిళలు, గ్రామస్తులు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. నీళ్ల కోసం అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని.. తమ గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ప్రజలకు సరైన తాగునీళ్లు ఇవ్వలేని కాంగ్రెస్ దద్దమ్మలు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు.
అసమర్థ కాంగ్రెస్ పాలనలో తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు, గ్రామస్తులు.
నాగర్ కర్నూల్ జిల్లా కోడేర్ మండలం ఎత్తం గ్రామంలో రెండు నెలలుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన మహిళలు.
నీళ్ల కోసం అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, తక్షణమే… pic.twitter.com/lR17G4vaN4
— BRS Party (@BRSparty) March 10, 2026
Bhadradri Kothagudem : కత్తి పట్టిన కలెక్టర్
ఏరియా వర్క్ షాప్లో సిపిఆర్, అగ్నిమాపక యంత్రాల వినియోగంపై అవగాహన
‘గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను సద్వినియోగం చేసుకోవాలి’