ట్రాలీ బ్యాగ్‌లలో నోట్ల కట్టలు.. రూ.30 వేల లంచం కేసులో తీగ లాగితే కదిలిన డొంక
ఒడిశాలో విజిలెన్స్ అధికారులు ఏకంగా ఒక పెద్ద అవినీతి తిమింగలాన్నే పట్టుకున్నారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన భువనేశ్వర్‌కు చెందిన మైన్స్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ దేవబ్రత మహంతి ఫ్లాట్‌లో విజిలెన్స్ అధికారులు మంగళవారం రాత్రి రూ.4 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.
- ఒడిశా అధికారి అక్రమాస్తులు చూసి విజిలెన్స్ అధికారుల షాక్
భువనేశ్వర్ : ఒడిశాలో విజిలెన్స్ అధికారులు ఏకంగా ఒక పెద్ద అవినీతి తిమింగలాన్నే పట్టుకున్నారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన భువనేశ్వర్‌కు చెందిన మైన్స్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ దేవబ్రత మహంతి ఫ్లాట్‌లో విజిలెన్స్ అధికారులు మంగళవారం రాత్రి రూ.4 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారని విజిలెన్స్ అధికారులు తెలిపారు. ఒక స్థానిక బొగ్గు వ్యాపారి నుంచి రూ.30 వేల లంచం తీసుకుంటుండగా మహంతిని పట్టుకుని అధికారులు అరెస్ట్ చేశారు.
అనంతరం విజిలెన్స్ శాఖ ఏకకాలంలో భువనేశ్వర్‌లోని ఆయన ఫ్లాట్, భద్రక్ జిల్లాలోని అతని సొంత ఇంట్లో, కటక్‌లోని కార్యాలయంలో దాడులు నిర్వహించారు. ఆయన ఆఫీస్ డ్రాయర్లో 1.20 లక్షల నగదుతో పాటు భువనేశ్వర్‌లోని ఫ్లాట్‌లో ట్రాలీ బ్యాగ్‌లలో దాచిన కట్టలకట్టల డబ్బు లభించింది. దీంతో పాటు 130 గ్రాముల బంగారం కూడా ఉంది. నగదును లెక్కించగా సుమారు 4 కోట్ల రూపాయలు ఉన్నట్టు వారు చెప్పారు. అంతకుముందు ఏసీబీ అధికారులు అత్యధిక మొత్తంలో స్వాధీనం చేసుకున్న నగదు రూ. 3.4 కోట్లు. మైనర్ ఇరిగేషన్ శాఖకు చెందిన ఒక అసిస్టెంట్ ఇంజినీర్ నుంచి 2022లో దీనిని స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

