Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు 10 టెలికాస్ట్ డేట్ లీక్ .. ప్రచారంలో నిజమెంత…!
Bigg Boss 10 | తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో బిగ్ బాస్ తెలుగు ఒకటి. ఇప్పటికే తొమ్మిది విజయవంతమైన సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు పదో సీజన్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. గత సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా కొత్త కాన్సెప్ట్‌లు, ఆసక్తికరమైన టాస్క్‌లు, సెలబ్రిటీలు-సామాన్యుల కలయికతో షోను మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Bigg Boss 10 | తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో బిగ్ బాస్ తెలుగు ఒకటి. ఇప్పటికే తొమ్మిది విజయవంతమైన సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు పదో సీజన్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. గత సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా కొత్త కాన్సెప్ట్‌లు, ఆసక్తికరమైన టాస్క్‌లు, సెలబ్రిటీలు-సామాన్యుల కలయికతో షోను మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి సీజన్‌కు ముందు ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సామాన్యుల నుంచి ఎంపికైన అభ్యర్థులు తమ ప్రతిభను నిరూపించుకుని బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించే అవకాశం పొందనున్నారు.
స్టార్ మా ఛానల్, జియో హాట్‌స్టార్ వేదికగా ‘బిగ్ బాస్ 10 అగ్నిపరీక్ష’ కార్యక్రమం ఆగస్టు 15 నుంచి ప్రసారం కానుంది. దాదాపు 15 రోజుల పాటు ఈ ప్రత్యేక షో కొనసాగుతుందని సమాచారం. ఇందులో పాల్గొనే అభ్యర్థులకు వివిధ రకాల పరీక్షలు, టాస్క్‌లు నిర్వహించి ఫైనల్ కంటెస్టెంట్లను ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే ఆడిషన్లు పూర్తి కాగా, తుది ఎంపిక కోసం ఈ అగ్నిపరీక్ష కీలకంగా మారనుంది. దీంతో బిగ్ బాస్ అభిమానుల్లో ఈ ప్రత్యేక కార్యక్రమంపై భారీ ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే, బిగ్ బాస్ తెలుగు 10 ప్రసార తేదీపై కూడా ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం, సెప్టెంబర్ 6, ఆదివారం బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంచ్ జరగనున్నట్లు సమాచారం.
ఆ రోజు అట్టహాసంగా కంటెస్టెంట్లను బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించనున్నారని, అనంతరం సెప్టెంబర్ 7 నుంచి రెగ్యులర్ ఎపిసోడ్లు ప్రారంభమవుతాయని టాక్ వినిపిస్తోంది. అయితే, దీనిపై ఇప్పటివరకు స్టార్ మా లేదా షో నిర్వాహకుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రతి సీజన్ మాదిరిగానే ఈసారి కూడా బిగ్ బాస్ తెలుగు 10 దాదాపు 15 వారాల పాటు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. టాస్క్‌లు, నామినేషన్లు, ఎలిమినేషన్లు, కెప్టెన్సీ పోటీలు, వీకెండ్ ఎపిసోడ్లతో ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రచారం ప్రకారం, బిగ్ బాస్ తెలుగు 10…సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9:30 గంటలకు అలానే శనివారం, ఆదివారం రాత్రి 9:00 గంటలకు స్టార్ మాలో ప్రసారం కానుంది. అదే సమయంలో జియో హాట్‌స్టార్‌లో కూడా షో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోయే సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, టీవీ నటులు, యూట్యూబర్లు, అలాగే అగ్నిపరీక్ష ద్వారా ఎంపికయ్యే సామాన్యులెవరు అనే అంశంపై ఇప్పటినుంచే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. పలువురు ప్రముఖుల పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ, అధికారిక జాబితా మాత్రం ఇంకా విడుదల కాలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

