భోపాల్: ఒక మహిళను తెలిసిన వ్యక్తి పెళ్లి పేరుతో వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని సోదరుడికి ఆమె చెప్పింది. దీంతో తన స్నేహితులతో కలసి ఆ వ్యక్తిని హత్య చేశాడు. సోదరి బర్త్ డే రోజున కేక్ కట్ చేసేందుకు వినియోగించిన కత్తితో అతడ్ని పొడిచి చంపాడు. (Brother Kills Man For Harassing Sister) మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 21 ఏళ్ల అభిషేక్ టింగా సోదరి పుట్టిన రోజు ఇటీవల జరిగింది. పొడవైన కత్తితో కేక్ కట్ చేసింది.
కాగా, ఆ మహిళతో పరిచయం ఉన్న అనిల్ ఆమె వెంటపడి వేధిస్తునాడు. తనను పెళ్లి చేసుకుంటే బంగారం, వెండి ఆభరణలు కొని ఇస్తానంటూ అనుచితంగా ప్రవర్తిస్తున్నాడు. ఆ మహిళ ఈ విషయాన్ని సోదరుడైన అభిషేక్‌కు చెప్పింది. దీంతో తన సోదరి పట్ల అగౌరవంగా, అసభ్యకరంగా ప్రవర్తించిన అనిల్‌ను హత్య చేయాలని అతడు భావించాడు. తన స్నేహితులతో కలిసి ప్లాన్ వేశాడు. అనిల్ కదలికలపై నిఘా పెట్టాడు. ఆన్లైన్లో కొన్ని కత్తులను ఆర్డర్ చేశాడు.
మరోవైపు ఆగస్ట్ 22న అనిల్ ఒక చోట మద్యం సేవిస్తున్నట్లు అభిషేక్‌కు తెలిసింది. దీంతో తన స్నేహితులతో కలిసి అక్కడకు వెళ్లాడు. సోదరి పుట్టిన రోజున కేక్ కట్ చేసిన కత్తితో అనిల్‌ను పొడిచి చంపాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Man Reports Wife Missing | భార్య మిస్సింగ్‌పై భర్త ఫిర్యాదు.. హత్య చేసినట్లు పట్టించిన కలరా ఉండలు