India suspend postal services to US | భారత్ కీలక నిర్ణయం.. ఆగస్ట్ 25 నుంచి అమెరికాకు పోస్టల్ సేవలు నిలిపివేత
India suspend postal services to US | భారత్ కీలక నిర్ణయం తీసుకున్నది. ట్రంప్ సుంకాల నేపథ్యంలో ఆగస్ట్ 25 నుంచి అమెరికాకు పోస్టల్ సేవలు నిలిపివేయనున్నది. ఈ మేరకు తపాలా శాఖ శనివారం ప్రకటించింది.
న్యూఢిల్లీ: భారత్ కీలక నిర్ణయం తీసుకున్నది. ట్రంప్ సుంకాల నేపథ్యంలో ఆగస్ట్ 25 నుంచి అమెరికాకు పోస్టల్ సేవలు నిలిపివేయనున్నది. (India suspend postal services to US) ఈ మేరకు తపాలా శాఖ శనివారం ప్రకటించింది. అమెరికా సుంకాలకు సంబంధించిన మార్పులు ఈ నెల చివరి నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 25 నుంచి ఆ దేశానికి పోస్టల్ కన్సైన్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పోస్టల్ డిపార్ట్మెంట్ శనివారం వెల్లడించింది.
కాగా, అమెరికా విధించిన టారిఫ్ డ్యూటీ కలెక్షన్ ప్రక్రియపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో ఆగస్ట్ 25 తర్వాత అమెరికాకు పోస్టల్ పార్శిల్స్‌ను తీసుకెళ్లబోమని పలు విమానయాన సంస్థలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో దీనికి అనుగుణంగా ఆగస్ట్ 25 నుంచి వంద డాలర్లు వరకు విలువైన లేఖలు, పత్రాలు, బహుమతి వస్తువులు మినహా మిగతా అన్ని రకాల వస్తువుల బుకింగ్స్‌ను నిలిపివేస్తున్నట్లు పోస్టల్ డిపార్ట్మెంట్ తెలిపింది.
మరోవైపు ఇప్పటికే పార్శిల్లను బుక్ చేసుకున్న, పంపలేని కస్టమర్లు రీఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చని పోస్టల్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ‘కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి తపాలా శాఖ తీవ్రంగా చింతిస్తోంది, వీలైనంత త్వరగా అమెరికాకు పూర్తి సేవలను తిరిగి ప్రారంభించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం’ అని అధికారిక ప్రకటనలో పేర్కొంది.
Also Read:
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Amid
- India
- Postal services
- Suspend
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

