Zombie Drugs: జాంబీ డ్రగ్స్‌కు బానిసవుతున్న పంజాబ్.. ఎంపీ హర్భజన్ వీడియోపై వివాదం
Zombie Drugs: పంజాబీ యువత డ్రగ్స్ బానిసై.. జాంబీలుగా మారిపోతున్నట్లు బీజేపీ ఎంపీ హర్భజన్ సింగ్ ఆరోపించారు. తన ఎక్స్ అకౌంట్లో తాజాగా ఆయన ఓ వీడియోను షేర్ చేశారు. దానిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
న్యూఢిల్లీ: బీజేపీ రాజ్యసభ ఎంపీ, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్.. తన సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్లో షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు తీవ్ర వివాదాన్ని సృష్టిస్తున్నది. పంజాబీ యువత డ్రగ్స్(Zombie Drugs) బానిసై.. జాంబీలుగా మారిపోతున్నట్లు తన వీడియోలో ఎంపీ హర్భజన్ ఆరోపించారు. ఇటీవల బీజేపీలో చేరిన హర్భజన్.. పంజాబ్ సర్కారు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తలపాగా కట్టుకున్న ఇద్దరు వ్యక్తులు జాంబీల తరహాలో నిలబడి ఉన్న వీడియోను టర్బనేటర్ తన ఎక్స్‌లో షేర్ చేశారు. పంజాబ్‌ను ఎలా మార్చారో చూడండి అంటూ ఆయన కామెంట్ చేశారు. తన పంజాబ్‌పై చెడు దృష్టి పడిందని ఆరోపించారు. పంజాబ్‌ను, పంజాబీ యువతను ప్రభుత్వాలు నిర్వీర్యం చేసినట్లు హర్భజన్ ఆరోపించారు. ఈ వీడియోకు మిలియన్ల సంఖ్యలో వ్యూవ్స్ వచ్చాయి. జాంగీ డ్రగ్‌గా పిలువబడే గ్జైలజైన్ డ్రగ్ తీసుకోవడం వల్ల ఆ వ్యక్తులు అలా మారినట్లు తెలుస్తోంది.
ਨਜ਼ਰ ਲੱਗ ਗਈ ਯਾਰ ਸਾਡੇ ਪੰਜਾਬ ਨੂੰ… 💔
ਸਰਕਾਰਾਂ ਨੇ ਕੀ ਹਾਲ ਬਣਾ ਦਿੱਤਾ ਪੰਜਾਬ ਦਾ ਤੇ ਪੰਜਾਬੀ ਨੌਜਵਾਨਾਂ ਦਾ। ਰੋਣਾ ਆਉਂਦਾ ਏ ਇਹ ਸਭ ਦੇਖ ਕੇ। 😢
ਬਖ਼ਸ਼ ਦਿਓ ਮੇਰੇ ਪੰਜਾਬ ਨੂੰ… ਮਾਫ਼ ਕਰੋ ਪੰਜਾਬ ਨੂੰ। 🙏
ਕਿੱਥੇ ਲੈ ਆਏ ਓ ਪੰਜਾਬ ਨੂੰ?
ਜਿਹੜਾ ਪੰਜਾਬ ਕਦੇ ਚੜ੍ਹਦੀ ਕਲਾ, ਹਿੰਮਤ ਤੇ ਬਹਾਦਰੀ ਲਈ ਜਾਣਿਆ ਜਾਂਦਾ ਸੀ, ਅੱਜ ਉਸੇ ਪੰਜਾਬ… pic.twitter.com/RAp3aYy0i2— Harbhajan Turbanator (@harbhajan_singh) August 10, 2026
ఎంపీ హర్భజన్ పోస్టు చేసిన వీడియోపై విమర్శలు వస్తున్నాయి. ఆ వీడియోను పంజాబ్‌లో షూట్ చేయలేదని ఆప్ నేత , పంజాబ్ ఆర్ధిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా ఆరోపించారు. బీజేపీ పంజాబ్ సర్కారును అపఖ్యాతికి గురి చేస్తున్నదని పేర్కొన్నారు. రాజస్థాన్‌లో తీసిన వీడియోకు పంజాబ్ అని చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఆయన తెలిపారు. గుజరాతీ పోర్టుల్లో భారీ స్థాయిలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంటున్నారని, అక్కడ నుంచి ఆ డ్రగ్స్ పంజాబ్‌కు వస్తున్నట్లు చీమా ఆరోపించారు. తాజా భజ్జీ పోస్టు చేసిన వీడియోను రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ జిల్లాలో షూట్ చేసినట్లు తెలుస్తోంది.
क्या यह भी राजस्थान की तस्वीरे है ? बात पंजाब की drug समस्या की है ।आपके paid troll से यह मुद्दा छिपाया नहीं जाएगा ।इस पर काम करना पड़ेग । जिम्मेदारियों से भागने से हल नहीं निकलेगा । बात किसी व्यक्ति विशेष को टारगेट करने की नहीं है । पंजाब और पूरे देश मे जो भी सेवन करता है नशीले… pic.twitter.com/Ct802htEq5
— Harbhajan Turbanator (@harbhajan_singh) August 11, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

