చుంచుపల్లి, సెప్టెంబర్ 22 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న పోతిరెడ్డి వర్షిత 39వ సబ్ జూనియర్ జాతీయ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్షిప్–2026-27కు ఎంపికైంది. ఈ నెల 27 నుండి 30వ తేదీ వరకు మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో డా.బాబాసాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడా యూనివర్సిటీ స్పోర్ట్స్ క్యాంపస్‌లో జరిగే పోటీల్లో విద్యార్థిని పాల్గొననుంది. జాతీయ స్థాయి పోటీలకు వర్షిత ఎంపిక కావడం పట్ల పాఠశాల హెచ్ఎం బాలాజీ, పీఈటీ కవిత, సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి నవీన్, కోచ్ పొన్నాల పృథ్వీరాజ్ హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు అభినందనలు తెలిపారు.
వర్షిత కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో జాతీయ స్థాయి పోటీల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రయాణం, ఇతర ఖర్చులు భరించడం ఇబ్బందిగా మారిందని కుటుంబ సభ్యులు తెలిపారు. వర్షిత క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు.