‘గర్భిణులు, పిల్లలు పోషకాహారం తీసుకోవాలి’
గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పోషక విలువలతో కూడిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలని, తద్వారా రక్తహీనతను నివారించి, ఆరోగ్య వంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని నల్లగొండ 47వ డివిజన్ కార్పోరేటర్ అబ్బగోని కవితా రమేష్ అన్నారు.
– నల్లగొండ 47వ డివిజన్ కార్పోరేటర్ అబ్బగోని కవితా రమేష్
నీలగిరి, సెప్టెంబర్ 22 : గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పోషక విలువలతో కూడిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలని, తద్వారా రక్తహీనతను నివారించి, ఆరోగ్య వంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని నల్లగొండ 47వ డివిజన్ కార్పోరేటర్ అబ్బగోని కవితా రమేష్ అన్నారు. జాతీయ పోషణ మాసం ఉత్సవాల్లో భాగంగా గొల్లగూడ సెక్టార్ పరిధిలోని బొయవాడ అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం పోషకాహార అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న పౌష్టికాహారాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోషణ్ అభియాన్ జిల్లా కో ఆర్డినేటర్ సతీష్, సూపర్వైజర్ జి.సరస్వతి, అంగన్వాడీ టీచర్లు భారతి, ఆర్ఫీ, ఆశా వర్కర్లు, గ్రామ మహిళలు, గర్భిణులు, బాలింతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
శివాజీనగర్లో..
పోషణమాసం కార్యక్రమంలో భాగంగా మంగళవారం చర్లపల్లి సెక్టార్ పరిధిలోని శివాజీనగర్ అంగన్వాడీ కేంద్రంలో పోషణమాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో స్థానికంగా లభించే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు, మొలకెత్తిన గింజలు, గుడ్లతో ప్రత్యేక ఆహార ప్రదర్శనను ఏర్పాటు చేశారు. చిన్నారుల ఎత్తు, బరువులను క్రమం తప్పకుండా నమోదు చేయించుకోవాలని, మొదటి వెయ్యి రోజుల పోషణ పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు అత్యంత కీలకమని ఐసీడీఎస్ఎస్ సూపర్వైజర్ మర్రి జయమ్మ సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ మహేశ్వరి, ప్రకృతాంబ, ఆయా సువర్ణ, తల్లులు, చిన్నారులు పాల్గొన్నారు.

‘గర్భిణులు, పిల్లలు పోషకాహారం తీసుకోవాలి’
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

