Sourav Ganguly | ‘నిన్ను, నీ కుటుంబాన్ని చంపేస్తాం’ అంటూ బెదిరింపు లేఖలు.. పోలీసులను ఆశ్రయించిన దాదా..!
Sourav Ganguly : భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) పోలీసులను ఆశ్రయించాడు. తరచుగా బెదిరింపు లేఖలు వస్తున్నాయని, నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు.
Sourav Ganguly : భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) పోలీసులను ఆశ్రయించాడు. ఇటీవల తనకు తరచుగా బెదిరింపు లేఖలు వస్తున్నాయని, నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని గంగూలీ ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా నిన్నూ, నీ కుటుంబాన్ని చంపేస్తాం అని ఇంగ్లీష్‌లో రాసి ఉన్న లేఖలను పోలీసులకు సమర్పించాడు దాదా.
టీమిండియా దిగ్గజ సారథి సౌరవ్ గంగూలీకి ఈమధ్య బెదిరింపు లేఖలు పంపిస్తున్నారు కొందరు దుండగులు. ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్న దాదాను చంపేస్తాం అంటూ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గత ఆరు నెలలుగా.. నిన్ను చంపేస్తాం. నిన్ను అంతం చేస్తాం. నిన్ను, నీ భార్య డోనా గంగూలీ, కుటుంబాన్ని చంపేస్తాం.. ఇలా గంగూలీని బెదిరించారు అగంతకులు. దాంతో, గంగూలీ కుటుంబం, అతడి వ్యక్తిగత సహాయకుడు పోలీసులకు ఈ బెదిరింపు లేఖలపై ఫిర్యాదు చేశారు.
Kolkata: Former Indian cricket team captain #SouravGanguly has complained to the police that he had received several threatening letters in the past few months, including one that warned of killing him and his wife #DonaGanguly, a senior officer said on Monday. The police began…
— Deccan Chronicle (@DeccanChronicle) August 11, 2026
గత ఆరు నెలలుగా గంగూలికి బెదిరింపు లేఖలు వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘గంగూలీ, అతడి కుటుంబానికి వస్తున్న బెదిరింపు లేఖలను మీ దృష్టికి తీసుకొస్తున్నాం. గత కొన్ని నెలలుగా కొందరు దాదాను భయపెట్టాలని లేఖలు పంపుతున్నారు.మొదట్లో వీటిని మేము పెద్దగా పట్టించుకోలేదు. కానీ, లేఖల తీవ్రత చూశాక.. వారికి గంగూలీ పట్ల కోపం, అతడిని చంపేస్తామని పేర్కొనడంతో అప్రమత్తమయ్యాం. ఈ లేఖల్లోని హెచ్చరికలతో మేము భయాందోళనలకు గురవుతున్నాం.

గంగూలీ ప్రాణాలు, అతడి కుటుంబం రక్షణకు సంబంధించిన విషయం ఇది. కాబట్టి త్వరగా చర్యలు తీసుకోగలరు’ అని స్థానిక థకుర్పుకుర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు గంగూలీ కుటుంబ సభ్యులు. వారి ఫిర్యాదుతో బెంగాల్ ప్రభుత్వ పోలీస్ విభాగం అప్రమత్తమైంది. ‘క్యాబ్ ప్రెసిడెంట్ గంగూలీకి వచ్చిన లేఖలపై దర్యాప్తు చేస్తామని, గంగూలీ, అతడి కుటుంబం రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామ’ని పోలీసులు వెల్లడించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

