Padma Devender Reddy | కారోబార్ ఆకుల కృష్ణ మృతి బాధాకరం : పద్మాదేవందర్ రెడ్డి
గ్రామపంచాయతీలో కారోబారుగా విధులు నిర్వహిస్తున్న ఆకుల కృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం బాధాకరమని మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు.
పాపన్నపేట, ఆగస్టు 11 : గ్రామపంచాయతీలో కారోబారుగా విధులు నిర్వహిస్తున్న ఆకుల కృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం బాధాకరమని మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఎదురెదురుగా రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో కృష్ణ మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న పద్మాదేవేందర్‌రెడ్డి మంగళవారం పాపన్నపేట గ్రామానికి చేరుకుని కృష్ణ అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు. అనంతరం కృష్ణ భార్యను ఓదార్చి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
కృష్ణ కూతురిని ఎత్తుకొని భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. ఆమె వెంట పార్టీ మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ వెంకట్ రెడ్డి, జిల్లా నాయకులు సోములు, మాజీ సర్పంచ్‌లు గురుమూర్తి గౌడ్, లింగారెడ్డి, నాయకులు కాశీనాథ్ రావు, ఉప్పరి వెంకటేశం, రంగంపేట శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

