న్యూఢిల్లీ: ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్(Air Chief Marshal).. తన డ్యాన్స్ మూవ్స్‌తో ఆకట్టుకున్నాడు. చాలా నిర్మలంగా కనిపించే అమర్ ప్రీత్.. ఓ సందర్భంలో ఐఏఎఫ్ క్యాడెట్లతో కలిసి స్టెప్పులేశారు. ఎయిర్ చీఫ్ మార్షల్ డ్యాన్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమిర్ ఖాన్ నటించిన 3 ఇడియట్స్ చిత్రంలోని ఓ పాటకు .. ఐఏఎఫ్ క్యాడెట్స్‌తో కలిసి ఎయిర్ చీఫ్ మార్షల్ చిందేశారు. క్యాజువల్ స్పోర్ట్స్ వియర్‌లో డ్రెస్సు వేసుకున్న అతను.. యువత కలిసి స్టెప్పులేయడం అందర్నీ ఆకర్షిస్తోంది. స్పోర్ట్స్ లేదా ఫిట్నెస్ యాక్టివిటీలో పాల్గొన్న అతను సరదాగా వైమానిక దళ సిబ్బందితో గడిపారు. అయితే వీడియో లొకేషన్ ఎక్కడ అన్న ఇంకా తెలియదు.
ఎయిర్ చీఫ్ మార్షల్ డ్యాన్స్ వీడియోపై.. ఆన్లైన్లో కామెంట్లు జోరందుకున్నాయి. బ్రహ్మోస్‌ను ఫైర్ చేసి, శత్రు స్థావరాలను పేల్చి.. బాయ్స్ ఎంజాయ్ చేస్తున్నట్లు ఓ వ్యక్తి కామెంట్ చేశారు. అణు సామర్థ్యం కలిగిన దేశంపై దాడి చేసిన తర్వాత మగాల్లు చిందేసినట్లు ఒకరు పేర్కొన్నారు. ఓ ఎయిర్ చీఫ్ మార్షల్ ఇలా చిందేయడం తొలిసారి అని, రాక్ స్టార్లా మారాడని మరో వ్యక్తి కామెంట్ చేశారు.
🚨अक्सर ऐसा देखने को नहीं मिलता कि बड़े अधिकारी प्रोटोकॉल से हटकर कुछ करें❗
📍एक सुखद पल तब देखने को मिला जब इंडियन एयर फ़ोर्स के चीफ, एयर चीफ़ मार्शल एपी सिंह ने IAF के जवानों और उनके परिवारों के साथ थोड़ा डांस किया।#IAF #Chief #Air #Chief #Marshal #AP #Singh #Family #Friends pic.twitter.com/71fYDeohP0— Journalist Jyoti magan 🇮🇳 (@jyotimagan555) August 10, 2026