KTR | బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల కొండల్ రెడ్డికి చెందిన టెస్సెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బండారం బయటపెట్టారని తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ స్కాం వివరాలను కూలంకషంగా వెల్లడించారు.
ఎనుముల కొండల్ రెడ్డి రేవంత్ రెడ్డికి తమ్ముడు. ఆయన లింక్డ్ ఇన్ ప్రొఫైల్‌లో నేను టెసరాక్ట్ అనే కంపెనీకి చైర్మన్‌గా ఉన్నానని కొండల్ రెడ్డి స్పష్టంగా రాశారు. టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్‌కు భూపాల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్స్‌కు నేను బాధ్యుడిని అని కొండల్ రెడ్డి చెప్పారు. టెసరాక్ట్ సంస్థ ఏర్పాటు చేసిన ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ, నేను చెప్పుకొని ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి అమెరికన్ కాన్సుల్ జనరల్ కూడా హాజరయ్యారని కేటీఆర్ తెలిపారు.
కొండల్ రెడ్డి ఏం చదువుకున్నాడో.. ఏమో నాకు తెలియదు కానీ సడెన్‌గా యూఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరమ్‌లో ఎగ్జిక్యూటివ్ బోర్డులో టెసరాక్ట్ చైర్మన్‌గా ఆయన జాయిన్ అయ్యారని వారు స్వయంగా లింక్డ్ ఇన్‌లో పెట్టుకున్నారు. యూఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరమ్ కూడా టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ చైర్మన్ అనుముల కొండల్ రెడ్డిని ఆహ్వానించడానికి సంతోషిస్తున్నామని వారు కూడా స్టేట్ మెంట్ ఇచ్చారు.
ఒక చిన్న ఇల్లు అడ్రస్ పెట్టుకున్నరు..
చదువు రాని రేవంత్ రెడ్డి బ్రదర్స్ అందరూ కోట్లు బూట్లు వేసుకుని ఇంత పెద్ద కంపెనీలకు చైర్మన్లు ఎట్లా అయిపోతున్నారు. ఎవరి కంపెనీ, ఏంటిదీ కంపెనీ అని ఆరా తీస్తే.. టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ కంపెనీ వెబ్సైట్ చూశాం. కంపెనీ ఫోన్ నంబర్ చూసినం. ఆ కంపెనీ ఫోన్ నంబర్ 12345678 అని ఉంది.. ఇలాంటి నంబర్లు ఉండొచ్చని మాకు తెలీదు, రేవంత్ రెడ్డి కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఏమైనా కనుగొన్నాడో అది కూడా తెలియదని కేటీఆర్ అన్నారు. ఈ కంపెనీకి ఒక్క ఉద్యోగి లేడు. ఇది వాళ్లే చెప్పారు. మార్చి 31 2025 నాడు ఎంతమంది ఉద్యోగులున్నారంటే.. ఒక్కరు కూడా లేడు. ఎక్కడుంది కంపెనీ అంటే.. ఎక్కడో పటాన్ చెరులో ఒక చిన్న ఇల్లు అడ్రస్ పెట్టుకున్నరు. కంపెనీ పెట్టినప్పుడు మూలధనం రూ. లక్ష. కంపెనీ పెయిడ్ ఆఫ్ క్యాపిటల్ లక్ష రూపాయలు.. ఎంప్లాయ్ ఒక్కడూ లేడు. చైర్మన్ ఎవరంటే అనుముల కొండల్ రెడ్డి. దీనికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం కేటాయించిందో తెలుసా..? రేవంత్ సర్కార్ 200 కోట్లు రూపాయల విలువైన 5 ఎకరాల భూమిని ఈ లక్ష రూపాయల మూలధనం ఉన్న కంపెనీకి కేటాయించి అతిపెద్ద కుంభకోణానికి పాల్పడిందన్నారు.
అసలు నీ శాఖలో ఏం జరుగుతుందో నీకు తెలుసా శ్రీధర్ బాబు..? అని కేటీఆర్ ప్రశ్నించారు. బహిరంగంగా టెసరాక్ట్ కంపెనీ చైర్మన్ నేనే అని కొండల్ రెడ్డి ప్రచారం చేసుకుంటుంటే, రేవంత్ రెడ్డి సోదరుడికి దీనికి సంబంధం లేదని శ్రీధర్ బాబు సిగ్గులేకుండా బుకాయిస్తున్నాడని కేటీఆర్ ఫైర్ అయ్యారు. అసలు నీ శాఖలో ఏం జరుగుతుందో నీకు తెలుసా..? లేక రేవంత్ రెడ్డి నుండి స్క్రిప్ట్ రాగానే అదే మాట్లాడుతున్నావా శ్రీధర్ బాబు..? అని అడిగారు.
కేవలం రూ. లక్షతో మొదలైన టెస్సెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి రూ.200 కోట్ల విలువైన 5 ఎకరాల భూమిని కేటాయించి రేవంత్ రెడ్డి అతి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డాడు
టెస్సెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి నేను చైర్మన్‌గా ఉన్నానని రేవంత్… https://t.co/klEDYS4c6z pic.twitter.com/nWqHxsRli5
— Telugu Scribe (@TeluguScribe) August 11, 2026
అసలు నీ శాఖలో ఏం జరుగుతుందో నీకు తెలుసా శ్రీధర్ బాబు?
బహిరంగంగా టెస్సరాక్ట్ కంపెనీ చైర్మన్ నేనే అని కొండల్ రెడ్డి ప్రచారం చేసుకుంటుంటే, రేవంత్ రెడ్డి సోదరుడికి దీనికి సంబంధం లేదని శ్రీధర్ బాబు సిగ్గులేకుండా బుకాయిస్తున్నాడు
అసలు నీ శాఖలో ఏం జరుగుతుందో నీకు తెలుసా?
లేక రేవంత్… https://t.co/cQSfhNmlnl pic.twitter.com/VJtk2P7vVY— Telugu Scribe (@TeluguScribe) August 11, 2026