Rahul Gandhi | హైదరాబాద్, మార్చి 2(నమస్తే తెలంగాణ): ‘మీరంతా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి. మార్షల్ ఆర్ట్స్‌ను వ్యక్తిగత జీవితంలో అన్వయించుకోండి’ ఇదీ కోట్లు ఖర్చు చేసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చి డీసీసీ అధ్యక్షులకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన విలువైన సూచన! అంతేకాదు.. రాహుల్ గాంధీ తాను నేర్చుకున్న జియు జిట్సు అనే మార్షల్ ఆ ర్ట్స్ విన్యాసాలను డీసీసీల ముందు ప్రదర్శించారు.
వికారాబాద్‌లోని అనంతగిరి హరిత రిసార్ట్స్‌లో సోమవారం నిర్వహించిన డీసీసీల శిక్షణ ముగింపు కార్యక్రమంలో రాహుల్ పాల్గొన్నారు. డీసీసీలకు పలు అంశాలపై సూచనలు, సలహాలిచ్చారు. రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై రాహుల్‌గాంధీ స్పష్టత ఇస్తారనే చర్చ జరిగింది. దీనిపై ఆయన ఎటూ తేల్చకుండానే వెళ్లిపోయారు.