Watch: రైలు ఎక్కబోతూ పట్టాల వద్ద పడిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
Woman Falls On Railway Track | స్టేషన్ నుంచి కదులుతున్న రైలు ఎక్కేందుకు ఒక మహిళ ప్రయత్నించింది. అయితే పట్టుతప్పిన ఆమె ప్లాట్‌ఫారమ్, రైలు పట్టాల మధ్య పడిపోయింది. ఆర్పీఎఫ్ సిబ్బంది అలెర్ట్‌తో ఆ రైలు ఆగింది. దీంతో ట్రాక్ పక్కన పడిన ఆ మహిళను రక్షించారు.
లక్నో: స్టేషన్ నుంచి కదులుతున్న రైలు ఎక్కేందుకు ఒక మహిళ ప్రయత్నించింది. అయితే పట్టుతప్పిన ఆమె ప్లాట్‌ఫారమ్, రైలు పట్టాల మధ్య పడిపోయింది. (Woman Falls On Railway Track) ఆర్పీఎఫ్ సిబ్బంది అలెర్ట్‌తో ఆ రైలు ఆగింది. దీంతో ట్రాక్ పక్కన పడిన ఆ మహిళను రక్షించారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. అయోధ్యకు చెందిన 61 ఏళ్ల మహిమా గంగ్వార్ తన భర్త రాజ్వీర్ సింగ్‌తో కలిసి శనివారం రాత్రి కాన్పూర్ సెంట్రల్ స్టేషన్‌కు చేరుకున్నది.
కాగా, అర్ధరాత్రి 12:33 గంటలకు ప్లాట్‌ఫారమ్ 5 నుంచి కదులుతున్న భోపాల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు మహిమ ప్రయత్నించింది. హడావిడిలో అదుపుతప్పిన ఆమె ప్లాట్‌ఫారమ్, రైలు పట్టాల మధ్య జారి పడిపోయింది. ఆందోళన చెందిన ఆమె భర్త, ప్రయాణికులు కేకలు వేశారు. దీంతో ఆ రైలు వెంటనే ఆగిపోయింది.
మరోవైపు ఆర్పీఎఫ్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు. ప్లాట్‌ఫారమ్, రైలు పట్టాల మధ్య పడిన ఆ మహిళకు ధైర్యం చెప్పారు. రైలు పట్టాల అవతల వైపునకు వెళ్లారు. భర్త సహాయంతో ఆమెను సురక్షితంగా బయటకు తీశారు. స్వల్పంగా గాయపడిన ఆ మహిళకు ప్రథమ చికిత్స అందించారు.
డాక్టరైన ఆమె కొడుకుకు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకున్నాడు. తదుపరి చికిత్స కోసం తల్లిని తన వెంట తీసుకుని వెళ్లాడు. కాగా, రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీలో నమోదైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Kanpur जाको राखे साइयां मार सके न कोय।चलती ट्रेन में चढ़ने की कोशिश में महिला ट्रेन के नीचे गिर गयी फर्रुखाबाद की रहने वाली है महिला सीसीटीवी में पूरी घटना कैद गरीब रथ (12593) प्लेट फॉर्म नम्बर 5 हुई घायल हुई महिला का इलाज जारी#Kanpurcenterrailwaystation pic.twitter.com/DomAAw8Q9y
— Puneet Pandey (@PuneetP78555204) August 24, 2025
Also Read:
Pak Nationals In Voter List | బీహార్ ఓటర్ల జాబితాలో పాకిస్థానీ జాతీయులు.. దర్యాప్తునకు ఆదేశం
Man Reports Wife Missing | భార్య మిస్సింగ్‌పై భర్త ఫిర్యాదు.. హత్య చేసినట్లు పట్టించిన కలరా ఉండలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

