జైపూర్: ఒక వ్యక్తి నకిలీ వైకల్య సర్టిఫికెట్తో ప్రభుత్వ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం పొందాడు. (Fake Disability Certificate) మెడికల్ టెస్ట్‌లో ఈ విషయం బయటపడింది. అయితే కంప్యూటర్ లోపం వల్లే ఇలా జరిగిందని అతడు ఆరోపించాడు. బీజేపీ పాలిత రాజస్థాన్‌లో ఈ సంఘటన జరిగింది. భరత్పూర్ జిల్లాలోని బయానా ప్రభుత్వ కళాశాలలో ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సవాయి సింగ్ గుర్జార్ పని చేస్తున్నాడు. ఈ ఉద్యోగం కోసం ‘చెవిటి మరియు మూగ’ వైకల్యానికి సంబంధించిన సర్టిఫికేట్‌ను అతడు సమర్పించాడు.
కాగా, కొందరు వ్యక్తులు నకిలీ వైకల్య సర్టిఫికెట్తో ప్రభుత్వ ఉద్యోగాలు పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌వోజీ) పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. వైకల్య సర్టిఫికెట్తో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారికి మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ సవాయి సింగ్ గుర్జార్ మాట్లాడగలడని, అతడికి వినికిడి లోపం మాత్రమే ఉన్నట్లు బయటపడింది. ఇలా మోసపూరితంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన 24 మందితో కూడిన జాబితాను ఆగస్ట్ 6న పోలీసులు విడుదల చేశారు. వారిని అనర్హులుగా ప్రకటించారు.
మరోవైపు గుర్జార్ పేరు కూడా ఈ జాబితాలో ఉన్నది. అయితే తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు అతడు ప్రయత్నించాడు. కరౌలి మెడికల్ బోర్డు వినికిడి లోపం కోసం ఆఫ్‌లైన్ సర్టిఫికేట్ జారీ చేసిందని తెలిపాడు. అయితే ఆన్లైన్లో అప్లోడ్ చేసినప్పుడు కంప్యూటర్ పొరపాటు వల్ల ‘చెవిటి మరియు మూగ’ అని సర్టిఫికెట్లో వచ్చిందని చెప్పాడు. వినికిడి లోపం కోటా కింద తాను ఉద్యోగం పొందానని, తప్పుడు కేటగిరీ కింద కాదంటూ తన తప్పును సమర్థించుకునేందుకు అతడు ప్రయత్నించాడు.
Also Read:
Pak Nationals In Voter List | బీహార్ ఓటర్ల జాబితాలో పాకిస్థానీ జాతీయులు.. దర్యాప్తునకు ఆదేశం
Man Reports Wife Missing | భార్య మిస్సింగ్‌పై భర్త ఫిర్యాదు.. హత్య చేసినట్లు పట్టించిన కలరా ఉండలు