ఖమ్మంలో రోడ్డెక్కిన నిరుద్యోగ అభ్యర్థులు
శాసనసభ ఎన్నికలకు ముందు ఉద్యోగాల కల్పనపై ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని, నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నదని ఆరోపిస్తూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులు ఖమ్మం నగరంలోని పాత బస్టాండ్ సెంటర్లో బైఠాయించి ప్ల కార్డులతో శనివారం ధర్నా నిర్వహించారు. తొలుత జిల్లా గ్రంథాలయం నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ దుమ్మెత్తిపోశారు.
- రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ అంటూ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం
- జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరిక
ఖమ్మం అర్బన్, ఫిబ్రవరి 28 : శాసనసభ ఎన్నికలకు ముందు ఉద్యోగాల కల్పనపై ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని, నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నదని ఆరోపిస్తూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులు ఖమ్మం నగరంలోని పాత బస్టాండ్ సెంటర్లో బైఠాయించి ప్ల కార్డులతో శనివారం ధర్నా నిర్వహించారు. తొలుత జిల్లా గ్రంథాలయం నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ దుమ్మెత్తిపోశారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు నిరుద్యోగ అభ్యర్థులు మాట్లాడుతూ నోటిఫికేషన్లు విడుదల చేస్తారని నెలల తరబడి ఇళ్లకు దూరంగా ఉంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతుంటే ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వకుండా మోసం చేసిందని మండిపడ్డారు. ఎన్నికల హామీగా మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం రెండున్నరేళ్లయినా పట్టించుకోలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిర్వాకంతో తాము తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ ఎక్కడ? మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? గ్రూప్-1 నియామకాలలో సిట్ ఎంక్వైరీ ఎక్కడ? అంటూ నినాదాలు చేశారు. జీవో నెంబర్ 108 స్థానంలో కొత్త జీవో జారీ చేయాలని, జీవో నెంబర్ 29, 66లను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. వెంటనే ఉద్యోగ నియామకాల క్యాలెండర్ విడుదల చేయాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు విస్తరింపజేస్తామని, పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

