ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన ఠాక్రే సోదరులను గణనాథుడు మరోసారి దగ్గరకు చేర్చాడు. బుధవారం వినాయకచవితి సందర్భంగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే నివాసానికి శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే వెళ్లారు. (Uddhav Visits Raj’s House) భార్య, కుమారుడు ఆదిత్య ఠాక్రేతో కలిసి రాజ్ ఠాక్రే ఇంట్లో జరిగిన గణపతి పూజలో పాల్గొన్నారు. 2005లో బాల్ ఠాక్రే మరణాంతరం ఠాక్రే సోదరులు విడిపోయారు. అయితే మహారాష్ట్రలోని ప్రాథమిక స్కూళ్లలో హిందీని అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం వీరిద్దరిని దగ్గరకు చేర్చింది.
కాగా, జూలైలో మరాఠా భాషా ఉద్యమం విజయోత్సవ సభలో ఉద్ధవ్, రాజ్ ఠాక్రే ఒకే వేదికను పంచుకున్నారు. స్థానిక ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని బహిరంగంగా ప్రకటించారు. అలాగే 13 ఏళ్ల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే నివాసమైన మాతోశ్రీని రాజ్ ఠాక్రే సందర్శించారు. తాజాగా వినాయకచవితి సందర్భంగా రాజ్ ఠాక్రే నివాసంలో జరిగిన గణపతి పూజలో తన కుటుంబంతో కలసి ఉద్ధవ్ ఠాక్రే పాల్గొన్నారు. దీంతో ఠాక్రే సోదరుల బంధం మరింత బలపడినట్లు రాజకీయ వూహాగానాలు వినిపిస్తున్నాయి.
पक्षप्रमुख मा. श्री. उद्धवसाहेब ठाकरे ह्यांनी सहकुटुंब राजसाहेब ठाकरे ह्यांच्या घरच्या गणपती बाप्पाचं दर्शन घेतले. pic.twitter.com/8VNdHbuu59
— ShivSena – शिवसेना Uddhav Balasaheb Thackeray (@ShivSenaUBT_) August 27, 2025
Also Read:
Asaduddin Owaisi | రాష్ట్రపతి నిజంగా ప్రధానితో రాజీనామా చేయించగలరా?: అసదుద్దీన్ ఒవైసీ