న్యూఢిల్లీ: రాష్ట్రపతి నిజంగా ప్రధానమంత్రితో రాజీనామా చేయించగలరా? అని ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ప్రశ్నించారు. ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రుల తొలగింపు బిల్లులను ఆయన తప్పుపట్టారు. మంత్రి మండలి సలహాల ద్వారా మాత్రమే రాష్ట్రపతి మార్గనిర్దేశం చేస్తారని రాజ్యాంగం చెబుతున్నదని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రధానిని తొలగించడానికి ప్రతిపాదిత చట్టం రాష్ట్రపతికి ఆ అధికారం ఇస్తుందా? అని పీటీఐతో అన్నారు. ‘ఏ రాష్ట్రపతి అయినా ప్రధానమంత్రిని రాజీనామా చేయిస్తారా?’ అని నిలదీశారు.
కాగా, రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలపై కూడా అసదుద్దీన్ ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. నలుగురు లేదా ఐదుగురు రాష్ట్ర మంత్రులను అరెస్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటే, ఆ రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా పడిపోతుందని అన్నారు. ‘రాష్ట్రాలకు స్వాతంత్ర్యం ఎక్కడ ఉంటుంది? వారిని నియంత్రించేది మీరే అవుతారు. నలుగురు లేదా ఐదుగురు మంత్రులను అరెస్టు చేస్తే ప్రభుత్వం పడిపోతుంది’ అని కేంద్రంపై మండిపడ్డారు.
మరోవైపు రాజ్యాంగంలో పేర్కొన్న అధికారాల విభజన సూత్రాన్ని ఈ బిల్లులు ఉల్లంఘిస్తాయని, ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రజల హక్కును దెబ్బతీస్తాయని ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈ ప్రభుత్వం పోలీసు రాజ్యాన్ని సృష్టించాలని నిశ్చయించుకున్నది. ఎన్నికైన ప్రభుత్వానికి చరమగీతం పాడుతుంది’ అని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఆయన దుయ్యబట్టారు. ఆ పార్టీ నిజంగా నైతికత గురించి మాట్లాడుతుంటే అరెస్టైన నేత కేంద్ర ప్రభుత్వ పక్షంలో చేరకూడదన్న చట్టం కూడా చేయాలని డిమాండ్ చేశారు.
VIDEO | Speaking to reporters about the Constitution (130th) Amendment Bill, AIMIM chief Asaduddin Owaisi says,”… We have stated in the Constitution that the President of India will be guided by the aid and advice of the Council of Ministers. This article is in the… pic.twitter.com/5uLHWZE9xF
— Press Trust of India (@PTI_News) August 25, 2025
Also Read:
ED raids Trinamool MLA’s home | ఎమ్మెల్యే ఇంటిపై ఈడీ రైడ్.. గోడ దూకి పారిపోయేందుకు యత్నం