ED raids Trinamool MLA’s home | ఎమ్మెల్యే ఇంటిపై ఈడీ రైడ్.. గోడ దూకి పారిపోయేందుకు యత్నం
ED raids Trinamool MLA's home | పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యే జిబన్ కృష్ణ సాహా ఇంటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు రైడ్ చేశారు. ఈ సందర్భంగా గోడ దూకి పారిపోయేందుకు ఆయన ప్రయత్నించారు. అయితే ఈడీ అధికారులు ఎమ్మెల్యే సాహాను పట్టుకుని అరెస్ట్ చేశారు.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యే జిబన్ కృష్ణ సాహా ఇంటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు రైడ్ చేశారు. (ED raids Trinamool MLA’s home) ఈ సందర్భంగా గోడ దూకి పారిపోయేందుకు ఆయన ప్రయత్నించారు. అయితే ఈడీ అధికారులు ఎమ్మెల్యే సాహాను పట్టుకుని అరెస్ట్ చేశారు. అలాగే సాక్ష్యాలను నాశనం చేసే ప్రయత్నంలో తన మొబైల్ ఫోన్స్‌ను ఇంటి సమీపంలోని చెరువులోకి ఆయన విసిరేశారు. అయితే ఈడీ అధికారులు ఆ రెండు మొబైల్ ఫోన్స్‌ను వెతికి తీసి స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపుతామని అధికారులు తెలిపారు.
కాగా, బుర్వాన్‌లోని జిబన్ కృష్ణ సాహా నివాసంతో పాటు రఘునాథ్‌గంజ్‌లోని ఆయన అత్తమామలకు చెందిన ఆస్తులను ఈడీ బృందాలు సోదా చేస్తున్నాయి. బిర్భూమ్ జిల్లాలోని ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడి ఇంట్లో కూడా సోదాలు జరిగాయి.
మరోవైపు పాఠశాల నియామక కుంభకోణంలో క్రిమినల్ అంశాలపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నది. ఈ కుంభకోణానికి సంబంధించి టీఎంసీ ఎమ్మెల్యే సాహా భార్యను గతంలో సీబీఐ ప్రశ్నించింది. 2023 ఏప్రిల్‌లో సీబీఐ ఆయనను అరెస్టు చేసింది. 2025 మేలో సాహాకు బెయిల్ మంజూరైంది.
అయితే స్కూల్ రిక్రూట్మెంట్ స్కామ్‌లోని మనీలాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సాహాను ఈడీ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. కోల్‌కతాకు తరలించి ప్రత్యేక ఈడీ కోర్టులో హాజరుపరుస్తారు.
Breaking | TMC MLA Jiban Krishna Saha has been arrested by the Enforcement Directorate (ED) in connection with the SSC scam. When ED officials arrived at his Burwan residence in Murshidabad, Saha attempted to flee by jumping over the boundary wall but was apprehended. He also… pic.twitter.com/6TfMQHfO7C
— Piyali Mitra (@Plchakraborty) August 25, 2025
Also Read:
Watch: రైలు ఎక్కబోతూ పట్టాల వద్ద పడిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సినిమాలకు మించి వ్యాపారాల్లో సమంత జోరు.. 8 నెలల్లోనే రూ.120 కోట్ల టర్నోవర్‌తో హాట్ టాపిక్!
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ యువకుడి పాదయాత్ర.. మార్గమధ్యలో కలిసి అభినందించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి!
Bigg Boss 10 | ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఆ నలుగురు.. టాప్‌లో వంశీ, రోహిత్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

