న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యాన్ని బీజేపీ అపహాస్యం చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మండిపడ్డారు. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిరసన చేస్తున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) అభ్యర్థులపై లాఠీఛార్జ్ చేయడాన్ని సోమవారం ఆయన ఖండించారు. ఢిల్లీ సీఎం రేఖ గుప్తా నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఎస్ఎస్సీ పరీక్షలో అక్రమాలకు వ్యతిరేకంగా విద్యార్థుల నిరసనలు అణగదొక్కేందుకు వారి గొంతులు నొక్కేందుకు బీజేపీ ప్రభుత్వం బలప్రయోగం చేస్తున్నదని ఆరోపించారు. నెలల తరబడి న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులపై శనివారం రాత్రి వేళ చీకటిలో లాఠీఛార్జ్ చేశారని దుయ్యబట్టారు.
కాగా, ప్రజాస్వామ్యాన్ని మాత్రమే కాకుండా మొత్తం వ్యవస్థను బీజేపీ అపహాస్యం చేసిందని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ‘బీజేపీ నియంతృత్వం, దుండగులు పాలన చూడండి. దేశంలో బహిరంగ దుండగులు రాజ్యమేలుతున్నారు. బీజేపీని ప్రశ్నించే వారిపై లాఠీఛార్జ్ ద్వారా నోరు మూయిస్తున్నారు. ఎవరినైనా అరెస్టు చేసి జైలులో పెట్టవచ్చు. ఏ చట్టాన్నైనా వారు కోరుకున్నప్పుడల్లా మార్చవచ్చు. ఎవరైనా బీజేపీకి ఓటు వేయకపోతే, వారి ఓటు తొలగించవచ్చు’ అని ఎక్స్ పోస్ట్‌లో విమర్శించారు.
Also Read:
ED raids Trinamool MLA’s home | ఎమ్మెల్యే ఇంటిపై ఈడీ రైడ్.. గోడ దూకి పారిపోయేందుకు యత్నం
Watch: పసి బిడ్డకు టీకా వేసేందుకు.. ఉప్పొంగుతున్న వాగును దాటిన ఆరోగ్య కార్యకర్త