భోపాల్: కుమార్తెను ప్రేమ పెళ్లి చేసుకున్న వ్యక్తిపై అత్తింటి కుటుంబం కక్షగట్టింది. ఏడాది తర్వాత గ్రామానికి వచ్చిన అల్లుడ్ని మామ, మరికొందరు దారుణంగా కొట్టి చంపారు. (Man Beaten To Death By Wife’s Father) మృతుడి భార్య ఫిర్యాదుతో ఆమె తండ్రి, ఇతర కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హర్సి గ్రామానికి చెందిన ఓంప్రకాష్ బాథమ్ ఏడాది కిందట అదే గ్రామానికి చెందిన శివానీ ఝాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. శివానీ కుటుంబం వీరి పెళ్లిని వ్యతిరేకించింది. దీంతో ఈ జంట తమ కుటుంబాలకు దూరంగా దబ్రాలో నివసిస్తున్నారు.
కాగా, ఆగస్ట్ 19న ఓంప్రకాష్ తన భార్యతో కలిసి సొంత గ్రామానికి తిరిగి వచ్చాడు. అయితే శివానీ తండ్రి, సోదరుడు, ఇతర బంధువులు, పొరుగువారితో కలిసి కర్రలతో ఓంప్రకాష్‌పై దాడి చేశారు. అతడ్ని దారుణంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన అతడ్ని గ్వాలియర్‌లోని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతున్న ఓంప్రకాష్ గాయాల నుంచి కోలుకోలేకపోయాడు. ఆరు రోజుల తర్వాత మరణించాడు.
మరోవైపు పరువు హత్యపై మృతుడి భార్య శివానీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్తను చంపిన తన పుట్టింటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దీంతో శివానీ తండ్రి ద్వారికా ప్రసాద్ ఝా, సోదరుడు రాజు ఝా, కుటుంబ సభ్యులు ఉమా ఓఝా, సందీప్ శర్మపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న వీరిని పట్టుకుని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
ED raids Trinamool MLA’s home | ఎమ్మెల్యే ఇంటిపై ఈడీ రైడ్.. గోడ దూకి పారిపోయేందుకు యత్నం
Watch: రైలు ఎక్కబోతూ పట్టాల వద్ద పడిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?