మొయినాబాద్, మార్చి15: హైదరాబాద్ శి వారులోని ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన పార్టీలో ఏపీలోని ఏలూరు నియోజకవర్గం టీడీపీ ఎంపీ పుట్ట మహేశ్కుమార్యాదవ్తో పాటు ఓ మాజీ ఎమ్మెల్యే, మరో ఏడుగురికి స్టేషన్ బెయిల్ ఇవ్వగా ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. ప్రజా ప్రతినిధులతో పాటు ముగ్గురిని జడ్జి ఎదుట హాజరు పరిచారు. కాగా ఏపీ సీఎం చంద్రబాబు స్పందించి ఎంపీ పుట్ట మహేశ్ యాదవ్‌కు నోటీసులు జారీ చేశారు. పోలీసులు, ఈగల్ టీం అధికారుల కథనం ప్రకారం.. సిటీ శి వారులోని ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన పార్టీలో ఏ పీలోని ఏలూరు నియోజకవర్గం టీడీపీ ఎంపీ మ హేశ్కుమార్యాదవ్తో పాటు వ్యాపారవేత్తలు రమేశ్,శ్రవణ్‌కుమార్,విజయ్‌కృష్ణ,కౌశిక్వ్రి,శరత్‌రెడ్డి,అర్జున్‌రెడ్డి, నమీత్శర్మ పాల్గొన్నారు. వారితో పాటు హైదరాబాద్‌కు చెందిన ప్రియాంకరెడ్డి కూడా ఉన్నారు.
పక్కా సమాచారంతో ఈగల్ టీం, ఎస్ఓటీ పోలీసులు ఫామ్ హౌస్‌లో సోదాలు నిర్వహించడానికి వెళ్లారు. పార్టీలో పాల్గొన్న వారు పోలీసులు ఫామ్ హౌస్‌కు 50 మీటర్ల దూరంలో ఉండగానే రి వాల్వర్తో కాల్పులు జరిపారు. ఢిల్లీకి చెందిన నమీత్ శర్మ అనే రియల్ వ్యాపారి లైసెన్స్ రివాల్వర్‌తో గాలిలోనికి కాల్పులు ఒక రౌండ్ చేయడంతో పాటు పోలీసులపై మూడు రౌండ్లు జరిపినట్లుగా పోలీసులు తెలిపారు. పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని అప్రమత్తమై ఫామ్ హౌస్‌పై దాడులు చేసి సోదాలు నిర్వహించారు.
అప్పటికే మద్యం సేవించి, కొకైన్ తీసుకుని అందరు మత్తులో తూగుతున్నారు.సోదాలు నిర్వహించిన తరువాత వారి వద్ద నుంచి 2 గ్రామాల కొకైన్, కాల్పులు జరిపిన రివాల్వర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 11మందిని పోలీసులు అ దుపులోనికి తీసుకుని మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌కు శనివారం తెల్లవారు జామున తీసుకెళ్లారు. పలువురికి డ్రగ్స్ పరీక్షలు చేశారు.11 మందిలో 5 గురికి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు నిర్దారిం చా రు.పోలీసులు కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు.
ఎంపీకి ముందు నెగటివ్..
పార్టీలో పాల్గొన్న వారిని మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించిన తరువాత డ్రగ్స్ పరీక్షలు చేశా రు. ర్యాపిడ్ టెస్ట్ చేయగా 11 మందిలో పలువురికి పా జిటివ్ వచ్చింది. అయితే మళ్లీ ఆదివారం ఉదయం అందరిని ఎర్రగడ్డలోని దవాఖానకు తరలించారు. వారి నుంచి రక్తం సేకరించి పరీక్షలు చేయగా ఐదు గురితో పాటు టీడీపీ ఎంపీ పుట్ట మహేశ్‌కు మా ర్యాదవ్కు కూడా పాజిటివ్ రావడంతో ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారించారు.
సిమ్లా నుంచి కొకైన్ కొనుగోలు..
కొకైన్ ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు.. ఎవరు కొనుగోలు చేశారనే దానిపై పోలీసులు శనివారం రాత్రి నుంచి విచారణ జరిపారు. ఢిల్లీ నుంచి వచ్చిన నమీత్శర్మ సిమ్లా నుంచి కొకైన్ కొనుగోలు చేశారని పోలీసుల విచారణలో తేలింది.