Anupam Kher | బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ దర్శకత్వంలో రూపొందిన స్ఫూర్తిదాయక చిత్రం ‘తన్వి ది గ్రేట్’ ఎట్టకేలకు డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఆటిజంతో బాధపడుతున్న ఒక యువతి, తన తండ్రి ఆశయ సాధన కోసం భారత సైన్యంలో చేరాలని చేసే అసాధారణ పోరాటం నేపథ్యంలో సాగే ఈ చిత్రం నేటి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ చిత్రంలో తన్వి పాత్రలో శుభాంగి దత్ అద్భుత నటనను కనబరచగా.. అనుపమ్ ఖేర్, జాకీ ష్రాఫ్, బోమన్ ఇరానీ మరియు అరవింద్ స్వామి వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో మెరిశారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 2025లో జరిగిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శితమై 7 నిమిషాల పాటు ప్రశంసల జల్లు అందుకున్న ఈ చిత్రం, 2026 ఆస్కార్స్ రిక్లాయిమ్ లిస్ట్‌లోనూ చోటు దక్కించుకోవడం విశేషం. థియేటర్లలో విడుదలైన ఎనిమిది నెలల తర్వాత డిజిటల్ వేదికపైకి వచ్చిన ఈ ఎమోషనల్ డ్రామాను వీక్షించేందుకు సినిమా ప్రియులు ఆసక్తి చూపుతున్నారు.
#TanviTheGreat (2025) by @AnupamPKher, now streaming on @PrimeVideoIN.
Ft. @DuttShubhangi @AnupamPKher @bindasbhidu #IainGlen @thearvindswami @bomanirani #PallaviJoshi @actornasser @trshinde & @karantacker.@mmkeeravaani @KausarMunir @ritesh_sid @FarOutAkhtar @excelmovies… pic.twitter.com/JqMDHjgJoz
— CinemaRare (@CinemaRareIN) March 3, 2026