బెంగళూరు: ఒక వ్యక్తి ప్రియురాలిని లాడ్జికి తీసుకెళ్లాడు. ఆమె నోట్లో జెలటిన్ స్టిక్ పేల్చి హత్య చేశాడు. (Man Kills Girlfriend With Gelatine Stick) మొబైల్ ఫోన్ పేలడంతో ఆ మహిళ మరణించినట్లు నమ్మించేందుకు ప్రయత్నించాడు. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని మైసూర్ జిల్లాలో ఈ దారుణ సంఘటన జరిగింది. హునసూరు తాలూకాలోని గెరసనహళ్లి గ్రామానికి చెందిన 20 ఏళ్ల రక్షితకు కేరళకు చెందిన వ్యక్తితో వివాహమైంది. అయితే బిలికేరె గ్రామానికి చెందిన సిద్ధరాజుతో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది.
కాగా, ప్రియురాలు రక్షితను ప్రియుడు సిద్ధరాజు తొలుత కప్పడి ఫీల్డ్‌కు రప్పించాడు. ఆ తర్వాత మైసూరులోని లాడ్జికి ఆమెను తీసుకెళ్లాడు. అక్కడ దారుణానికి పాల్పడ్డాడు. ప్రియురాలు రక్షిత నోటిలో జెలటిన్ స్టిక్ పేల్చి హత్య చేశాడు. మొబైల్ ఫోన్ పేలినట్లు గట్టిగా కేకలు వేశాడు. పేలిన మొబైల్ ఫోన్ శిథిలాలను కిటికీ నుంచి బయటకు విసిరేసినట్లు హోటల్ సిబ్బందికి చెప్పాడు.
మరోవైపు హోటల్ సిబ్బంది బయట వెతకగా ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో రక్షితను సిద్ధరాజు చంపినట్లు అనుమానించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకున్నారు. సిద్ధరాజును అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. రక్షిత నోటిలో జెలటిన్ స్టిక్ పేల్చి హత్య చేసినట్లు అతడు ఒప్పుకున్నాడని పోలీస్ అధికారి తెలిపారు. నేరానికి వినియోగించిన పేలుడు పదార్థాన్ని ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Asaduddin Owaisi | రాష్ట్రపతి నిజంగా ప్రధానితో రాజీనామా చేయించగలరా?: అసదుద్దీన్ ఒవైసీ
ED raids Trinamool MLA’s home | ఎమ్మెల్యే ఇంటిపై ఈడీ రైడ్.. గోడ దూకి పారిపోయేందుకు యత్నం