NZ vs ENG | టాస్ గెలిచిన న్యూజిలాండ్.. ఇంగ్లండ్ జోరుకు చెక్ పెట్టేనా..!
NZ vs ENG : శ్రీలంకను ఓడించి పోటీలో నిలిచిన కివీస్.. చావోరేవో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఢీ కొడుతోంది. ప్రేమదాస మైదానంలో విజయంతో సెమీస్‌కు దూసుకెళ్తుందా? లేదా పాక్‌కు అవకాశమిస్తుందా? అనేది మరికాసేపట్లో తెలియనుంది.
NZ vs ENG : పొట్టి ప్రపంచకప్ నాకౌట్ దశలో పుంజుకున్న న్యూజిలాండ్ సెమీస్‌పై గురిపెట్టింది. గ్రూప్ బీ రెండో మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించి పోటీలో నిలిచిన కివీస్.. చావోరేవో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఢీ కొడుతోంది. ప్రేమదాస మైదానంలో విజయంతో సెమీస్‌కు దూసుకెళ్తుందా? లేదా పాక్‌కు అవకాశమిస్తుందా? అనేది మరికాసేపట్లో తెలియనుంది. టాస్ గెలిచిన బ్లాక్ క్యాప్స్ సారథి మిచెల్ శాంట్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
వరుసగా రెండు విజయాలతో సెమీస్ చేరిన ఇంగ్లండ్ నాకౌట్ దశను ఘనంగా ముగించాలనుకుంటోంది. అయితే.. చావోరేవో పోరులో గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లాలని న్యూజిలాండ్ భావిస్తోంది. సో.. ఇరుజట్ల మధ్య ప్రేమదాసలో హోరాహోరీ పోరు ఖాయమనిపిస్తోంది.
Will New Zealand seal a semi-final spot tonight?
The Blackcaps are unchanged from their win against Sri Lanka, England bring in Rehan Ahmed for Jamie Overton
Live ball-by-ball: https://t.co/dLKzTVv25R pic.twitter.com/SP7a5Unsjp
— ESPNcricinfo (@ESPNcricinfo) February 27, 2026
పిచ్ స్పిన్నర్లకు పిచ్ అనుకూలించే అవకాశమున్నందున ఇంగ్లండ్ ఒక పేసర్‌ను తగ్గించుకుని.. రెహాన్ అహ్మద్‌ను తీసుకుంది. కివీస్ మాత్రం.. లంకపై గెలిచిన బృందాన్నే కొనసాగించింది.. అయితే.. ఈ వేదికపై గత ఆరు మ్యాచుల్లో ఐదింటా మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. ఈ నేపథ్యంలోనే కివీస్ సారథి శాంట్నర్ టాస్ నెగ్గడంతో బ్యాటింగ్‌కే మొగ్గు చూపాడు.
న్యూజిలాండ్ తుది జట్టు : టిమ్ సీఫర్ట్(వికెట్ కీపర్), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, మిచెల్ శాంట్నర్(కెప్టెన్), కొలో మెక్కొన్చీ, మ్యాట్ హెన్రీ, ఇష్ సోధీ, లాకీ ఫెర్గూసన్.
ఇంగ్లండ్ తుది జట్టు : ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బ్యాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, లియాం డాసన్, రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

