లక్నో: వరకట్న వివాదం వల్ల భర్త అయిన పోలీస్ తన భార్యకు నిప్పంటించాడు. సజీవ దహనానికి ప్రయత్నించాడు. (cop sets wife ablaze) తీవ్ర కాలిన గాయాలైన ఆ మహిళను ఢిల్లీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పోలీస్ శాఖలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దేవేంద్ర ఇటీవల బరేలీకి బదిలీ అయ్యాడు. వారం రోజులు సెలవులో ఉన్న అతడు తన బంధువులతో కలిసి నర్సుగా పని చేస్తున్న భార్య పారుల్ ఇంటికి చేరుకున్నాడు. వరకట్నం డిమాండ్లు తీర్చకపోవడంతో ఆమెకు నిప్పంటించి సజీవ దహనానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా, తీవ్ర కాలిన గాయాలైన పారుల్‌ను తొలుత స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఢిల్లీలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పారుల్ సోదరుడి ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ దేవేంద్ర, అతడి తల్లి, సోదరుడు సహా ఆరుగురిపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. దేవేంద్ర, పారుల్కు 13 ఏళ్ల కిందట వివాహమైందని, వారికి ఇద్దరు కవల పిల్లలున్నట్లు వెల్లడించారు.
Also Read:
Woman Gang Raped | మహిళను కిడ్నాప్ చేసి.. ఆరు నెలలుగా సామూహిక అత్యాచారం
Watch: పసి బిడ్డకు టీకా వేసేందుకు.. ఉప్పొంగుతున్న వాగును దాటిన ఆరోగ్య కార్యకర్త