వేసవి ఉదయం మేల్కోవటం నాకు ఎంతో ఇష్టం
అన్ని చెట్ల మీద పక్షులు గానం చేస్తుంటే..
ఎక్కడో దూరాన శంఖాన్ని పూరిస్తూ వేటగాడు
శూన్యాకాశాన్ని పాటలతో
నింపుతున్న ఆకాశ విహంగం
ఆహా! ఎంత మధురోదయం
వేసవికాలం ఉదయాన్నే బడికి వెళ్లడం అంటే
ఆనందానికి దూరం కావడమే
మాస్టారు కోపపు చూపుల్ని
నిరాశతో నిట్టూర్పులతో రోజంతా గడపడం
చిన్నపిల్లల రోజువారీ అనుభవం
సరిగ్గా అప్పుడే వాలిపోతూ కూర్చుంటూ
ఆందోళనా గంటల్ని ఖర్చు చేస్తుంటాను
పుస్తకాల్లో పొందలేను ఆనందం
అట్లా అని తరగతి గదిలో ఏమీ దొరకదు
అలా అలసట వర్షంలో తడుస్తున్నట్లు నేను
ఆనందం కోసం పుట్టిన పక్షి
పంజరంలో కూర్చొని ఎలా పాడగలదు?
పిల్లవాన్ని భయాలు వెంటాడుతుంటే
మృదువైన లేత రెక్కల్ని వాల్చి
తన తీయటి బాల్యాన్ని
కోల్పోకుండాఎలా ఉండగలడు?
ఓ తల్లిదండ్రులారా!
పూవుల్ని మొగ్గలోనే తుంపివేస్తే
లేత మొక్కల్ని వసంతంలోనే పెరికివేస్తే
బాధలు కష్టాలు నిజమైన
ఆనందాన్ని దూరం చేయవా!
వేసవి ఫలాలు ఆనందంతో
ఎలా జన్మనిస్తాయి?
రాబోయే శీతాకాలపు శిథిలాలని తట్టుకుని
ఎదురీదే శక్తి ఎలా లభిస్తుంది?
విలియం బ్లేక్ The School Boy
కవితకి స్వేచ్ఛానువాదం
– ప్రొ. బాణాల శ్రీనివాస రావు 944047143