భారత్ వద్ద 190 అణ్వాయుధాలు
ఈ సంవత్సరం జనవరి నాటికి భారత్ వద్ద 190 అణ్వాయుధాలు ఉన్నట్టు స్టాక్‌హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ(సిప్రి) సోమవారం తెలిపింది.
- సిప్రి 2026 నివేదిక వెల్లడి
స్టాక్‌హోమ్: ఈ సంవత్సరం జనవరి నాటికి భారత్ వద్ద 190 అణ్వాయుధాలు ఉన్నట్టు స్టాక్‌హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ(సిప్రి) సోమవారం తెలిపింది. నిరుడుతో పోలిస్తే పది ఆయుధాలను భారత్ ఎక్కువగా సమకూర్చుకుందని తెలిపింది. పాకిస్థాన్ దగ్గర సుమారు 170 అణ్వాయుధాలు ఉన్నాయని.. నిరుటితో పోలిస్తే ఈ సంఖ్య మారలేదని తన 2026 సంవత్సర నివేదికలో వెల్లడించింది. భారత్ తన వద్ద ఉన్నవాటిలో 12 అణ్వాయుధాలను మోహరించిందని సిప్రి తెలిపింది. చైనా లాంటి దీర్ఘ శ్రేణి లక్ష్యాలను ఛేధించగల ఆయుధాలను భారత్ సిద్ధం చేసుకొందని వెల్లడించింది. ఆపరేషన్ సిందూర్‌లో పాక్ స్థావరాలపై భారత్ దాడిని తన నివేదికలో ప్రస్తావించింది. మరోవైపు చైనా తన అణ్వాయుధాల సంఖ్యను 620కి, రష్యా 4,400కు పెంచుకుందని చెప్పింది. అమెరికా అణ్వాయుధాల సంఖ్య(3700)లో ఎలాంటి మార్పు లేదని ప్రకటించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

