Watch: బలమైన గాలి వానకు కదిలిన గ్రౌండ్ పరికరాలు.. దెబ్బతిన్న మూడు ఎయిర్ ఇండియా విమానాలు
Air India Aircrafts Damaged | బలమైన గాలి వానకు ఎయిర్‌పోర్ట్‌లోని గ్రౌండ్ పరికరాలు వేగంగా కదిలాయి. పార్క్ చేసిన విమానాలను అవి ఢీకొట్టాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియాకు చెందిన మూడు విమానాలు దెబ్బతిన్నాయి.
న్యూఢిల్లీ: బలమైన గాలి వానకు ఎయిర్‌పోర్ట్‌లోని గ్రౌండ్ పరికరాలు వేగంగా కదిలాయి. పార్క్ చేసిన విమానాలను అవి ఢీకొట్టాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియాకు చెందిన మూడు విమానాలు దెబ్బతిన్నాయి. (Air India Aircrafts Damaged) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం సాయంత్రం బలమైన గాలులతో కూడిన వర్షం కురిసింది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2 వద్ద ఉన్న ఎయిర్ ఇండియాకు చెందిన ఇంజినీరింగ్ పరికరం, ఇండిగోకు చెందిన గ్రౌండ్ సపోర్ట్ ల్యాడర్ బలమైన గాలులకు కదిలి ముందుకు దూసుకెళ్లాయి. అక్కడ నిలిచి ఉన్న పలు విమానాలను అవి ఢీకొట్టాయి.
కాగా, ఈ సంఘటనలో ఎయిర్ ఇండియాకు చెందిన మూడు విమానాలతో పాటు మరో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక విమానానికి స్వల్పంగా నష్టం జరిగినట్లు తెలుస్తున్నది. ప్రభావితమైన మూడు విమానాలలో రెండు త్వరలోనే తిరిగి కార్యకలాపాల్లోకి వస్తాయని, మూడవ దానిని బాగు చేయడానికి కొంత సమయం పడుతుందని ఎయిర్ ఇండియాకు చెందిన అధికారి తెలిపారు.
మరోవైపు వాతావరణంలో మార్పు గురించి విమానాశ్రయ నిర్వాహకులు, విమానయాన సంస్థలకు గానీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఎలాంటి హెచ్చరిక జారీ చేయలేదని ఒక అధికారి ఆరోపించారు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
How alert Agile (6E ground handling co) staff ran to stop an @IndiGo6E stepladder just in time – 6.5 metres away from an @airindia ✈️ parked at @DelhiAirport T2 bay 206 on Sunday evening
There was no prior storm/bad weather warning, say IGIA and airlines https://t.co/inrJqMawHB pic.twitter.com/5fGnxqWcLt
— Saurabh Sinha (@27saurabhsinha) June 7, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

