నీలగిరి, ఆగస్టు 03 : పుట్టిన బిడ్డకు గంటలోనే తల్లి పాలు తాగించడం వల్ల రోగ నిరోదక శక్తి పెంపుంతుందని నల్లగొండ ఆర్డీఓ వై.ఆశోక్ రెడ్డి అన్నారు. ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు -2026లో భాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమాల పోస్టర్ను సోమవారం కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..అంగన్వాడీలు, ఆశ వర్కర్లు ఇంటింటి సందర్శనలు చేసి గర్భిణీలు, బాలింతలకు తల్లి పాల ప్రాముఖ్యతను వివరించాలన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు గ్రామ స్థాయిలో ఈ అవగాహనను విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ సీడీపీఓ చంద్రకళ, నకిరేకల్ సిడీపీఓ అసరా అంజూమ్, సిబ్బంది పాల్గొన్నారు.