డర్బన్ : దక్షిణాఫ్రికా పర్యటనను ఆస్ట్రేలియా ఓటమితో ఆరంభించింది. డర్బన్ వేదికగా ఇరుజట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య సఫారీ జట్టు.. 67 పరుగుల తేడాతో కంగారూలను ఓడించి మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 297/8 స్కోరు చేసింది.
మాథ్యూ బ్రీట్జె (112) శతకంతో రెచ్చిపోగా ఆఖర్లో మార్కో యాన్సెన్ (75) మెరుపులు మెరిపించాడు. ఛేదనలో ఆసీస్ 41.2 ఓవర్లకు 230 రన్స్కే కుప్పకూలింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ (60), మాథ్యూ రెన్షా (44) పోరాడారు.