Gajula Ramaram | గాజులరామారంలో కాంగ్రెస్ సర్కార్ బుల్డోజర్లతో మరోసారి కూల్చివేతలు చేపడుతూ పేద ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. రెవెన్యూ అధికారులు పారిశ్రామిక షెడ్లు, దుకాణాలను కూల్చివేయగా.. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై పోలీసులు లాఠీలతో దాడి చేశారు. ఈ క్రమంలో బాధితులు ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు.
గాజులరామారంలో ప్రభుత్వ కూల్చివేతల్లో ఇల్లు కోల్పోయిన ఓ బాధితురాలు మాట్లాడుతూ.. మేం 50 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాము, కాగితాలు వేరుకుంటం.. గరీబోళ్లం మేం. మేమేం బంగ్లాలు, మేడలు కట్టుకోలేదు. రోజూ కష్టం చేసేటోళ్లం. మా ఇల్లు చూడండి పోయి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మేం గరీబోళ్లం సార్.. కొట్టకు సార్ అన్నా వినకుండా మమ్మల్ని కొట్టారంది. మాకు పైనుంచి ఆర్డర్ వచ్చింది.. అధికారులు మిమ్మల్ని చంపినా కానీ అడిగేవాళ్లు ఎవరూ లేరంటున్నారు. మాకు పొద్దున్నుంచి అన్నం లేదు.. మా అన్నంలో మట్టిపోసిర్రు. మా ఇల్లును కూలగొట్టిర్రని ఆవేదన వ్యక్తం చేసింది. 50 ఏండ్ల నుంచి మమ్మల్ని ఎవరూ ఏం అనలేదు.. కానీ ఇప్పుడు ఇలా చేస్తున్నారని మండిపడ్డది.
50 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాము, ఈరోజు మా ఇల్లు కూలగొట్టారు
మిమ్మల్ని చంపినా మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు అని పోలీసులు బెదిరించారు
కొట్టకండి సార్ అని ఎంత వేడుకున్నా వినకుండా మమ్మల్ని దారుణంగా కొట్టారు
తినే అన్నంలో కూడా మట్టి పోసి కూలగొట్టారు
– గాజులరామారంలో ప్రభుత్వ కూల్చివేతల్లో… https://t.co/TCt6MCpJbN pic.twitter.com/XQdRKEepBn
— Telugu Scribe (@TeluguScribe) August 3, 2026
గాజులరామరంలో తెలంగాణ ప్రభుత్వం కూల్చివేతలు
పారిశ్రామిక షెడ్లు, దుకాణాలను కూల్చివేసిన రెవెన్యూ అధికారులు
అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని కట్టడి చేసిన పోలీసులు pic.twitter.com/kJjgCUWiwQ
— Telugu Scribe (@TeluguScribe) August 3, 2026