Made In Pakistan Bedsheet | ఆలయం ఉత్సవంలో బెడ్‌షీట్ కొనుగోలు చేసిన మహిళ.. పాకిస్థాన్‌లో తయారైనట్లు తెలిసి షాక్
Made In Pakistan Bedsheet | ఒక ఆలయం ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సంతలో ఒక మహిళ బెడ్‌షీట్ కొనుగోలు చేసింది. ఇంటికి వెళ్లి చూడగా ‘మేడ్ ఇన్ పాకిస్థాన్’ అని దానిపై ఉన్నది. దీంతో ఆ మహిళ షాక్ అయ్యింది. ఈ విషయాన్ని వీడియోలో షేర్ చేసింది.
ముంబై: ఒక ఆలయం ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సంతలో ఒక మహిళ బెడ్‌షీట్ కొనుగోలు చేసింది. ఇంటికి వెళ్లి చూడగా ‘మేడ్ ఇన్ పాకిస్థాన్’ అని దానిపై ఉన్నది. దీంతో ఆ మహిళ షాక్ అయ్యింది. ఈ విషయాన్ని వీడియోలో షేర్ చేసింది. మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. జూన్ 3న ‘సంకష్టి చతుర్థి’ పండుగ సందర్భంగా పింప్రి-చించ్వాడ్లోని మోరయా గోసావి ఆలయం వద్ద ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో పూజా సరాఫ్ అనే మహిళ ఒక బెడ్‌షీట్‌తో పాటు కొన్ని వస్తువులు కొనుగోలు చేసింది.
కాగా, ఆ మహిళ తన ఇంటికి వెళ్లిన తర్వాత కొనుగోలు చేసిన బెడ్‌షీట్‌ను పరిశీలించింది. దానిపై ‘మేడ్ ఇన్ పాకిస్థాన్’ అన్న ట్యాగ్ ఉండటం చూసి ఆమె షాక్ అయ్యింది. దీని గురించి సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. ‘మనం ఎక్కడ నివసిస్తున్నాం? సరిహద్దు ప్రాంతంలో కూడా లేము కదా. అయినా సరే, మన ఇంట్లో ఇలా ‘మేడ్ ఇన్ పాకిస్థాన్’ వస్తువు ఉండటం ఏమిటి?’ అని ఆమె ప్రశ్నించింది.
మరోవైపు ఈ సంఘటన పట్ల తనకు చాలా బాధగా ఉన్నదని, తన లాంటి చాలా మంది హిందువులు అక్కడ ఇలాంటి దుప్పట్లు కొనుగోలు చేసి వారి ఇళ్లకు తీసుకెళ్లినట్లు ఆమె వాపోయింది. ‘వస్తువులు కొనేటప్పుడు కళ్లు తెరిచి చూసుకోవాలి. ఇప్పుడు నా కళ్లు తెరుచుకున్నాయి’ అని ఆమె అన్నది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అయితే జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ నుంచి దిగుమతి, ఎగుమతి అయ్యే అన్ని రకాల వస్తువులపై కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నిషేధం విధించింది. అయినప్పటికీ ఆ దేశ వస్తువుల అమ్మకాలు జరుగుతున్నట్లు తాజా సంఘటన ద్వారా బయటపడింది. దీంతో పింప్రి-చించ్వాడ్ పోలీసులు స్పందించారు. ఆ మహిళ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు. పాక్ ఉత్పత్తులను విక్రయించే విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్‌ను కూడా కోరారు.
A Hindu woman bought a bedsheet at a religious fair in Pune, Maharashtra.
It had “Made in Pakistan” tag inside. She exposed how Pakistani goods are being sold openly at Hindu events to insult sentiments.@DGPMaharashtra pic.twitter.com/Zhr31Dpkho
— Angry Saffron (@AngrySaffron) June 6, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

