Mini Africa in Gir Forest | గిర్ అడవుల్లో మినీ ఆఫ్రికా.. గుజరాత్‌లోని జాంబుర్ గ్రామానికి ఆఫ్రికన్లకు సంబంధమేంటి?
Mini Africa in Gir Forest | ద భారత్‌లోని ఓ పల్లెలోనూ ఎక్కడ చూసినా అదే ఆఫ్రికా సంస్కృతి కనిపిస్తుంది! అదే.. గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో ఉన్న జాంబుర్. అక్కడికే ఈవారం మన పల్లె‘టూర్'!
Mini Africa in Gir Forest | దట్టమైన అడవులు. గర్జించే సింహాలు. నల్లని, దృఢమైన దేహాలు కలిగిన మనుషులు. ముషిండో డ్రమ్స్‌కు అనుగుణంగా చేసే నృత్యాలు. ఇవన్నీ ఆఫ్రికా పల్లెల్లో సర్వసాధారణంగా దర్శనమిచ్చే దృశ్యాలు. కానీ, భారత్‌లోని ఓ పల్లెలోనూ ఎక్కడ చూసినా అదే ఆఫ్రికా సంస్కృతి కనిపిస్తుంది! అదే.. గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో ఉన్న జాంబుర్. అక్కడికే ఈవారం మన పల్లె‘టూర్’!
భారత్ అంటేనే.. భిన్నత్వంలో ఏకత్వం! ఎన్నో రకాల జాతులు నిలయమిది. ఇక్కడ ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన సంస్కృతి కనిపిస్తుంది. కానీ, గుజరాత్‌లోని ఓ పల్లె మాత్రం ‘మినీ ఆఫ్రికా’లా దర్శనమిస్తుంది. సుప్రసిద్ధ ఆసియా సింహాలకు నిలయమైన గిర్ జాతీయ అభయారణ్యం నడిబొడ్డున ఉంటుంది జాంబుర్ గ్రామం.
ఈ పల్లెలో అడుగుపెడితే.. ‘ఆఫ్రికాలో ఉన్నామా!?’ అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే, ఇక్కడివాళ్లంతా ఆఫ్రికన్ల వారసులు. ‘సిద్ధీ’ తెగకు చెందినవారు. వీళ్ల పూర్వికులు కొన్ని శతాబ్దాల క్రితమే ఆఫ్రికా ఖండం నుంచి భారతదేశానికి వలస వచ్చారు.

Jambur Village2
ఇదీ నేపథ్యం
ఏడో శతాబ్దంలో వందల సంఖ్యలో ఆఫ్రికన్లు భారత్ బాటపట్టారు. బానిసలుగా, వ్యాపారులుగా, నావికులుగా, సైనికులుగా ఇటు వచ్చారు. అరబ్బుల కాలం నుంచి బ్రిటిషర్ల జమానా వరకూ.. సిద్ధీల రాక కొనసాగింది.

Jambur Village3
ఈ క్రమంలో జునాగఢ్‌ను పాలించిన నవాబులు కూడా కొందరు ఆఫ్రికావాసులను భద్రతా సిబ్బందిగా నియమించుకున్నారట. అలా వచ్చినవారంతా ఇక్కడే స్థిరపడ్డారు. 16వ శతాబ్దం తర్వాత వీరి జనాభా గణనీయంగా పెరగడంతో.. వారికంటూ ఓ సొంత గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

Jambur Village6
రెండు సంస్కృతుల సమ్మేళనం..
జాంబుర్ గ్రామంలో ఆఫ్రికన్-గుజరాతీ సంస్కృతుల సమ్మేళనం కనిపిస్తుంది. గ్రామస్తుల జీవన విధానం కూడా.. రెండు ఖండాల అద్భుతమైన కలయికగా ఉంటుంది. ఆఫ్రికన్ల వారసులు అయినప్పటికీ.. జాంబుర్ వాసులంతా గుజరాతీలోనే మాట్లాడతారు. వస్త్రధారణ, ఆహారపు అలవాట్లు కూడా గుజరాతీ శైలిలోనే ఉంటాయి.

Jambur Village5
అయితే, వీరిలో ఇప్పటికీ ఆఫ్రికన్ వారసత్వం సజీవంగానే ఉన్నది. అందుకు ప్రత్యక్ష నిదర్శనం.. వారి సాంప్రదాయ ‘ధమాల్’ నృత్యం! ఒంటికి రంగులు పూసుకుని, అత్యంత వేగంగా, లయబద్ధంగా చేసే ఈ నృత్యం.. ఆఫ్రికన్లకే సొంతం.

ఈ ధమాల్ నృత్యంలో మరో ప్రత్యేక ఆకర్షణ.. ముషిండో అని పిలిచే ఆఫ్రికన్ డ్రమ్స్! జాంబుర్ వాసుల ఈ సంప్రదాయ నృత్యం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల సేకరణ ఇక జాంబుర్వాసుల జీవనాధారం. గిర్ అడవులకు వచ్చే పర్యాటకులకు గైడ్లుగానూ కొందరు పనిచేస్తుంటారు.

Jambur Village7
ఇలా వెళ్లాలి..
సాసన్ గిర్ నుంచి 20 కిలోమీటర్లు, ప్రసిద్ధ సోమనాథ్ ఆలయం నుంచి 32 కిలోమీటర్ల దూరంలో జాంబుర్ గ్రామం ఉంటుంది. జునాగఢ్, వెరావల్, రాజ్‌కోట్, అహ్మదాబాద్ నగరాల నుంచి తలాలా, సాసన్ గిర్కు బస్సులు, ప్రైవేట్ టాక్సీలు అందుబాటులో ఉంటాయి. అక్కడి నుంచి ఆటోలు, ట్యాక్సీల్లో జాంబుర్ గ్రామానికి చేరుకోవచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

