ప్రధాన్ దిగిపోకపోతే దేశవ్యాప్త నిరసనలు
దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహించనున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రకటించారు.
- అన్ని రాష్ర్టాలనూ సందర్శిస్తా: దీప్కే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహించనున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రకటించారు. జూన్ 13లోగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే నిరసన ప్రదర్శనలకు సార థ్యం వహించేందుకు తానే స్వయ ంగా వివిధ రాష్ర్టాలను సందర్శిస్తానని ఆదివారం రాత్రి సోషల్ మీడి యా వేదిక ఎక్స్‌లో పోస్టు చేసిన ఒక వీడియోలో ఆయన పేర్కొన్నారు. అప్పటికీ విద్యా మంత్రి రాజీనామా చేయడానికి నిరాకరించిన పక్షంలో శాంతియుత నిరసన నిర్వహించేందుకు దేశ నలుమూలలకు చెందిన విద్యార్థులు మళ్లీ ఢిల్లీకి కదలివస్తారని ఆయన తెలిపారు. ఆదివారం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లోని తన ఇంటికి చేరుకున్న దీప్కే అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. గత 10-12 సంవత్సరాలు భారతీయ రాజకీయాలు హిందూ-ముస్లిం అంశాలపైనే దృష్టి కేంద్రీకరించాయని, అయితే అటువంటి రాజకీయాలు ఉద్యోగ అవకాశాలను కల్పించలేదని దీప్కే వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

