Watch: పార్కులో జంట.. వెంబడించి కొట్టిన సాధు వేషధారణ వ్యక్తులు
Couple Beaten By Saint Dressed Men | ఒక పార్కులో కూర్చొన్న జంటను సాధు వేషధారణ వ్యక్తులు వేధించారు. వారిని వెంబడించి కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో వారిపై విమర్శలు వెల్లువెత్తాయి.
లక్నో: ఒక పార్కులో కూర్చొన్న జంటను సాధు వేషధారణ వ్యక్తులు వేధించారు. వారిని వెంబడించి కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో వారిపై విమర్శలు వెల్లువెత్తాయి. (Couple Beaten By Saint Dressed Men) ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఈ సంఘటన జరిగింది. తులసి ఉద్యాన వనంలో ఒక జంట కూర్చుకున్నది. కాషాయ దుస్తులు ధరించిన నలుగురు వ్యక్తులు వారిని చుట్టుముట్టి వేధించారు. ఆ జంట పార్క్ బయటకు పరుగెత్తగా వారు వెంబడించారు. పార్క్ బయట యువకుడిపై పిడిగుద్దులు కురిపించారు. కాళ్లతో అతడ్ని తన్నారు. స్థానికులు ఎవరూ జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించలేదు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో కాషాయ దుస్తులు ధరించిన వ్యక్తులు ఆ జంటను వేధించి కొట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించారు. జంటపై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులను ధర్మేంద్ర దాస్, గుంకేష్ తివారీగా గుర్తించి అరెస్ట్ చేశారు.
మరోవైపు గోండాకు చెందిన వారిద్దరూ చదువు నిమిత్తం అయోధ్యలో నివసిస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఏదైనా మత సంస్థ లేదా అఖారాతో వారికి సంబంధం ఉన్నదా అన్నది ఆరా తీస్తున్నారు. అయితే కాషాయ దుస్తులు ధరించిన వ్యక్తులు ఆ జంటపై దాడి చేయడాన్ని పలువురు హిందూ మత పెద్దలు ఖండించారు.
#UttarPradesh #Ayodhya Viral Video Update
“Ayodhya Tulsi Udyan Assault: Viral Video 15 Days Old, Both Accused Arrested”
A video showing a couple being assaulted at Tulsi Udyan, Ayodhya, has gone viral. Police investigation reveals the incident is 15 days old. No complaint was… pic.twitter.com/QfSclXDE0J
— Siraj Noorani (@sirajnoorani) June 4, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Ayodhya Park
- beaten
- chased
- Dressed
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
Gold Locket | శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
Grammys 2027 | గ్రామీ బరిలో ‘ధురంధర్’ సౌండ్‌ట్రాక్.. ఏకంగా ఎనిమిది కేటగిరీల్లో ఎంట్రీలు!
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

