పాట్నా: పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు సోషల్ మీడియాలో రీల్ కోసం ప్రయత్నించారు. బైక్‌పై వేగంగా వెళ్తూ స్టంట్లు చేశారు. (Students Making Reels On Bike) అదుపుతప్పిన బైక్ ఆగి ఉన్న బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్టూడెంట్స్ మరణించారు. తీవ్రంగా గాయపడిన మరో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నది. బీహార్‌లోని ముంగేర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పదో తరగతి చదువుతున్న స్నేహితులైన ముగ్గురు యువకులు బైక్‌పై సుల్తాన్‌గంజ్ వెళ్తున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో రీల్ కోసం ప్రయత్నించారు. ముంగేర్‌లోని జాతీయ రహదారి 80 మీద బైక్‌పై వేగంగా వెళ్తూ స్టంట్లు చేశారు.
కాగా, ఆ బైక్ అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న బస్సును అది ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శుభం, ఆనంద్ కుమార్ మరణించారు. తీవ్రంగా గాయపడిన సోను కుమార్ స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నదని పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
cop sets wife ablaze | వరకట్న వివాదం వల్ల.. భార్యకు నిప్పంటించిన పోలీస్
Woman Gang Raped | మహిళను కిడ్నాప్ చేసి.. ఆరు నెలలుగా సామూహిక అత్యాచారం