హైదరాబాద్ : సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వకర్మ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. పంతులు చెరువు లో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు ( Youth ) సాగర్ ( 17 ) , అభిషేక్ ( 17 ) నీటిలో మునిగి దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.