Solar Eclipse | ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపించదట.. ఎందుకంటే..!
Solar Eclipse | 2026 ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు, ఔత్సాహికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ అరుదైన దృశ్యం భారతదేశంలో మాత్రం కనిపించదు. మన దేశంలో ఆ సమయానికి రాత్రి అవుతుండటమే ఇందుకు ప్రధాన కారణమట. సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది.
Solar Eclipse : 2026 ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం (Solar Eclipse) సంభవించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు, ఔత్సాహికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ అరుదైన దృశ్యం భారతదేశం (India) లో మాత్రం కనిపించదు. మన దేశంలో ఆ సమయానికి రాత్రి అవుతుండటమే ఇందుకు ప్రధాన కారణమట. సూర్యుడి (Sun) కి, భూమి (Earth) కి మధ్య చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. చంద్రబింబం సూర్యుడిని పూర్తిగా కప్పివేయడంతో పగటిపూట కూడా ఆకాశం చీకటిగా మారి, ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి.
ఆ సమయంలో నక్షత్రాలు, గ్రహాలు కూడా స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది. నాసా శాస్త్రవేత్తల కథనం ప్రకారం.. సూర్యుడు చంద్రుడి కంటే 400 రెట్లు పెద్దదైనప్పటికీ, అదే స్థాయిలో దూరంగా ఉండటంవల్ల ఆకాశంలో చంద్రుడు, సూర్యుడు దాదాపు ఒకే పరిమాణంలో కనిపిస్తాయి. ఈ సంపూర్ణ గ్రహణం గ్రీన్లాండ్, ఐస్లాండ్, స్పెయిన్, పోర్చుగల్‌లోని కొన్ని ప్రాంతాలతోపాటు ఉత్తర రష్యా, అట్లాంటిక్ మహాసముద్రం పరిధిలో కనిపిస్తుంది. ఇక ఉత్తర అమెరికా, కెనడా, యూరప్, వాయువ్య ఆఫ్రికాలోని పలు ప్రాంతాల్లో పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించే అవకాశం ఉంది.
భారత కాలమానం ప్రకారం.. ఆగస్టు 12 రాత్రి 9:45 గంటలకు ప్రారంభమయ్యే ఈ గ్రహణం ఆగస్టు 13 తెల్లవారుజామున 2:15 గంటల వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో మన దేశంలో సూర్యరశ్మి ఉండదు కాబట్టి గ్రహణాన్ని వీక్షించే వీలు లేదు. అందువల్ల గ్రహణం సమయంలో పాటించే సూతక్ కాలం వంటి సాంప్రదాయ నియమాలు మనకు వర్తించవని పండితులు స్పష్టం చెబుతున్నారు. అయితే ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించాలనుకునే భారతీయులు నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వంటి సంస్థల అధికారిక వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Earth
- India
- Solar eclipse
- sun
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

