బూర్గంపహాడ్, జూలై 29 : బూర్గంపహాడ్ మండల కేంద్రంలో పట్టపగలే హ్యాండ్ బోరు చోరీకి గురైన సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల |ప్రకారం… బూర్గంపహాడ్లోని ఆర్ఎంపీ వైద్యుడు ప్రసాద్ ఇంటి పక్కనే ఉన్న పంచాయతీ హ్యాండ్ బోరును మంగళవారం మధ్యాహ్న సమయంలో కొందరు వ్యక్తులు వచ్చి తొలగించారు. స్థానికులు బోరును ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నించడంతో మరమ్మతులు చేస్తున్నామని చెబుతూ బోరు మెటీరియల్తో ఉడాయించారు. ఈ విషయమై బుధవారం వార్డు సభ్యులు తోకల శ్రీను తొలగించిన బోరు స్థానంలో కొత్త బోరు ఏర్పాటు చేయాలని సర్పంచ్ మందా నాగరాజును ప్రశ్నించగా పాత బోరు తొలగించిన విషయమే తమకు తెలియదని చెప్పడంతో హ్యాండ్ బోరు అపహరణకు గురైనట్లు గుర్తించారు.