లక్నో: బైక్‌లో ఉన్న క్యాష్ బ్యాగ్‌ను ఒక కోతి ఎత్తుకెళ్లింది. చెట్టుపైకి దానిని తీసుకెళ్లింది. ఆహారం కోసం ఆ బ్యాగ్‌లో వెతికింది. అందులో ఉన్న రూ.500 నోట్లను కిందకు వెదజల్లింది. దీంతో ఆ నోట్లు చేజిక్కించుకునేందుకు కొందరు వ్యక్తులు పోటీపడ్డారు. (Monkey Snatches Cash Bag, Showers Notes) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్య జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దోదాపూర్ గ్రామానికి చెందిన ప్రైవేట్ టీచర్ రోహితాష్ చన్రా మంగళవారం మధ్యాహ్నం న్యాయవాదితో కలిసి బిధున తహసీల్ కార్యాలయానికి చేరుకున్నాడు. రిజిస్ట్రేషన్ కోసం సంబంధితన పత్రాలతో బిజీగా ఉన్నాడు.
కాగా, రోహితాష్ తన బైక్‌లో ఉంచిన బ్యాగులో రూ.80,000 డబ్బు ఉన్నది. ఇంతలో ఒక కోతి ఆ బైక్ వద్దకు వచ్చి క్యాష్ బ్యాగ్ ఎత్తుకెళ్లింది. చెట్టుపైకి చేరిన తర్వాత ఆ బ్యాగ్ తెరిచి ఆహారం కోసం వెతికింది. ఆహారం కనిపించకపోవడంతో అందులో ఉన్న 80 వేల విలువైన రూ.500 నోట్లను కిందకు వెదజల్లింది. దీంతో ఆ కార్యాలయం వద్ద ఉన్న కొందరు వ్యక్తులు ఆ నోట్లు చేజిక్కించుకునేందుకు పోటీపడ్డారు.
మరోవైపు క్యాష్ బ్యాగ్‌ను కోతి ఎత్తుకెళ్లడం గురించి తెలుసుకున్న రోహితాష్ షాక్ అయ్యాడు. తన డబ్బును దక్కించుకునేందుకు అతడు ప్రయత్నించాడు. కొందరు వ్యక్తుల సహాయంతో నోట్లు సేకరించాడు. అయితే రూ.52,000 మాత్రమే తిరిగిపొందాడు. మిగిలిన రూ.28,000 మాయం కావడంతో నిరాశ చెందాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
MONKEY IN UTTAR PRADESH SNATCHES BAG CONTAINING ₹80,000, CLIMBS A TREE, AND SHOWERS CASH ONTO THE STREET.
In a strange turn of events in Auraiya, Uttar Pradesh, a monkey created chaos after snatching a bag containing ₹80,000 from a school teacher’s bike. The teacher, Rohitash… pic.twitter.com/syP1Ja33YO
— 𝗜𝗡𝗗𝗜𝗔 𝗢𝗕𝗦𝗘𝗥𝗩𝗘𝗥 (@IndiaObserverX) August 27, 2025
Also Read:
Boy Hits Man With Car, Drags Body | కారుతో వ్యక్తిని ఢీకొట్టి.. కొంతదూరం ఈడ్చుకెళ్లిన బాలుడు
Himachal Pradesh Floods | హిమాచల్‌లో భారీ వరదలు.. మనాలి టోల్ ప్లాజాను ముంచెత్తిన బియాస్ నది