కుమ్మెర ఘటన అమానవీయం.. బాలల హక్కుల ప్రజావేదిక
నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో కులం పేరిట చేసిన దాడి అత్యంత అమానవీయమైనదని బాలల హకుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్‌చంద్రబోస్ మండిపడ్డారు.
హైదరాబాద్, ఫిబ్రవరి24 (నమస్తే తెలంగాణ): నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో కులం పేరిట చేసిన దాడి అత్యంత అమానవీయమైనదని బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్‌చంద్రబోస్ మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన కొందరు బీసీ వర్గానికి చెందిన కుటుంబాన్ని ఆలయంలోకి రానివ్వకపోవడమేగాక, ఈ ఘటనలో రెండునెలల పాప మృతిచెందడం దారుణమని నిప్పులు చెరిగారు. ప్రభుత్వం తక్షణం స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని, నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బీసీ కమిషన్‌కు ఫిర్యాదు
కుమ్మెర గ్రామ ఘటనను తెలంగాణ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు, న్యాయవాది ఉపేంద్ర తీవ్రంగా ఖండించారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్‌కు ఫిర్యాదు చేశారు. బీసీ సామాజికవర్గ కుటుంబంపై దాడికి పాల్పడిన వారిపై, వారికి వత్తాసు పలుకుతున్న పోలీసు, ఇతర అధికారులపై కఠిన చర్యలను తీసుకోవాలని కోరారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

