ఖైరతాబాద్, ఫిబ్రవరి 24: పర్సంటేజీల కోసమే ఫీజు బకాయిలు చెల్లించడం లేదని, గడిచిన రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఫీజు రీయింబర్స్మెంట్ బ కాయిలు విడుదల చేయలేదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పటికే రూ.10వేల కోట్ల ఫీజు బకాయిలు ఉన్నాయని, వచ్చే ఏడాది మరో రూ.4వేల కోట్లు కలిపి మొత్తం రూ.14వేల కోట్లకు పెరుగనున్నట్టు పేర్కొన్నారు. బీసీ విద్యార్థి సం ఘం ఆధ్వర్యంలో మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్షాలు, విద్యార్థులు, మేధావులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల విస్తృ త స్థాయి సమావేశం జరిగింది.
సమావేశానికి హాజరైన శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. మం త్రి పొంగులేటి వంటి వారికి అడగ్గానే బిల్లులు వస్తాయని, పిల్లల చదువు విషయంలో మా త్రం ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని పేర్కొన్నా రు. రాష్ట్రంలో 2,800 కళాశాలల్లో 12.50 లక్షల మంది విద్యార్థులు చదవుతున్నారని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వమే కాకుండా, కళాశాలల యాజమాన్యాలూ బాధ్యత వహించాలని సూచించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, దీంతో వారి చదువులు కొనసాగించేందుకు తప్పని పరిస్థితిలో ఆస్తులు అమ్మి ఫీజులు చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. సమావేశంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎంపీ ఈటల రాజేందర్, జాజుల శ్రీనివాస్‌గౌడ్, జూలూరు గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు.