AP News | గామన్ బ్రిడ్జి సమీపంలో యువతి మృతదేహం.. తీవ్ర గాయాలతో యువకుడు.. ఏం జరిగింది..?
AP News | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి నగర శివారులో మంగళవారం తెల్లవారుజామున తీవ్ర కలకలం రేగింది. కాతేరు పరిధిలోని గామన్ బ్రిడ్జి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఓ యువతి మృతదేహంతోపాటు, ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ యువకుడిని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
AP News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి నగర శివారులో మంగళవారం తెల్లవారుజామున తీవ్ర కలకలం రేగింది. కాతేరు పరిధిలోని గామన్ బ్రిడ్జి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఓ యువతి మృతదేహంతోపాటు, ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ యువకుడిని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు.
తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న యువకుడిని నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో యువకుడిని కోటిలింగాలపేటకు చెందిన అభిలాష్‌గా, యువతిని శాంతినగర్ నివాసిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది హత్యనా లేక ఆత్మహత్యాయత్నమా అనే కోణంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఘటనపై ఇప్పటికే ఇరు కుటుంబాల సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో తేలుతాయని చెప్పారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

