El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
El Nino | భారతదేశాన్ని ఎల్‌నినో (El Nino) తీవ్రంగా దెబ్బకొట్టనుందా..? ఎల్‌నినో కారణంగా పెరుగుతున్న అసాధారణ ఉష్ణోగ్రతలు రాబోయే నెలల్లో ప్రాణనష్టాన్ని పెంచనున్నాయా..? తాజా పరిశోధన ఆధారిత అంచనాలు ఈ ప్రశ్నలకు ఔననే సమాధానం ఇస్తున్నాయి. అమెరికా (USA) లోని షికాగో విశ్వవిద్యాలయానికి (Chikago University) చెందిన ‘క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ (Climate Impact Lab)’ రూపొందించిన న్యూ ట్రాకర్ ప్రకారం.. 2026 అక్టోబర్ నుంచి 2027 మార్చి నాటికి భారత్‌లో అధిక వేడి కారణంగా సాధారణస్థాయికి మించి సుమారుగా 55 వేల మరణాలు సంభవించే అవకాశం ఉన్నది.
El Nino : భారతదేశాన్ని ఎల్‌నినో (El Nino) తీవ్రంగా దెబ్బకొట్టనుందా..? ఎల్‌నినో కారణంగా పెరుగుతున్న అసాధారణ ఉష్ణోగ్రతలు రాబోయే నెలల్లో ప్రాణనష్టాన్ని పెంచనున్నాయా..? తాజా పరిశోధన ఆధారిత అంచనాలు ఈ ప్రశ్నలకు ఔననే సమాధానం ఇస్తున్నాయి. అమెరికా (USA) లోని షికాగో విశ్వవిద్యాలయానికి (Chikago University) చెందిన ‘క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ (Climate Impact Lab)’ రూపొందించిన న్యూ ట్రాకర్ ప్రకారం.. 2026 అక్టోబర్ నుంచి 2027 మార్చి నాటికి భారత్‌లో అధిక వేడి కారణంగా సాధారణస్థాయికి మించి సుమారుగా 55 వేల మరణాలు సంభవించే అవకాశం ఉన్నది. ఆ మరణాల్లో ఎక్కువ భాగం మార్చి నెలలోనే నమోదయ్యే ప్రమాదం ఉందని న్యూ ట్రాకర్ అంచనా వేసింది.
ఇది వాతావరణ సమాచారం, ఉష్ణోగ్రతల అంచనాలు, గతంలో అధిక ఉష్ణోగ్రతలకు సంబంధించిన మరణాల మధ్య ఉన్న సంబంధాల ఆధారంగా రూపొందించిన నమూనా అంచనా మాత్రమే. వాస్తవంగా ఎంతమంది మరణిస్తారో ఈ అంచనా కచ్చితంగా వెల్లడించడం లేదు. కాగా, ఎల్‌నినో అంటే పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడంవల్ల సంభవించే ఓ పరిణామం. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా గాలుల దిశ, వర్షపాతం, ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తాయి. ఈసారి ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ప్రపంచ వాతావరణ సంస్థ కూడా ఈ ఏడాది ఎల్‌నినో బలంగా ఉందని, డిసెంబర్లో గరిష్ఠస్థాయికి చేరే అవకాశం ఉందని హెచ్చరించింది. దీని ప్రభావాలు 2027 ప్రారంభం వరకు కొనసాగవచ్చని అంచనా వేసింది. న్యూ ట్రాకర్ అంచనాల ప్రకారం.. అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ప్రపంచవ్యాప్తంగా అధిక వేడి కారణంగా సాధారణ స్థాయికి మించి సుమారు 3.73 లక్షల మరణాలు సంభవించే అవకాశం ఉంది. ఈ ఆరు నెలల కాలంలో నైజీరియాలో 56 వేల మరణాలు, భారత్‌లో 55 వేల మరణాలు సంభవించవచ్చని అంచనా. ఇండోనేషియాలో 29 వేలు, బ్రెజిల్లో 19 వేల మరణాలు సంభవించే ప్రమాదం ఉందని న్యూ ట్రాకర్ పేర్కొన్నది.
అయితే ఈ న్యూ ట్రాకర్ అంచనాలు మరణాలు తప్పనిసరిగా సంభవిస్తాయని చెప్పడంలేదు. ముందస్తు హెచ్చరికలు, తాగునీటి సదుపాయాలు, చల్లదనం కల్పించే కేంద్రాలు, బయట పనిచేసే కార్మికులకు రక్షణ, ఆరోగ్య సేవలను మెరుగుపరచడం ద్వారా ఈ ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
RS Praveenkumar | జర్మనీలో ఉద్యోగమని చెప్పి ఓ యువకుడి చేతికి కత్తి ఇచ్చారు.. కాంగ్రెస్ సర్కార్ మరో స్కాంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Cyclone Victims | తుపాను బాధితులకు అండగా ఉండాలని ఏపీ కేబినెట్ నిర్ణయం
Satish Jarkiholi | కర్ణాటకలో కోటి ఓట్ల తొలగింపు సరైనదే.. ‘సర్’ ను సమర్థించిన కాంగ్రెస్ సీనియర్ నేత జర్కిహోళి..!
‘నగర పారిశుధ్యానికి శ్రమించే కార్మికుల ఆరోగ్యమే ముఖ్యం’
ట్రెండింగ్ వార్తలు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!

