‘నేటికి కరువు సహాయక చర్యలు చేపట్టకపోవడం శోచనీయం’
రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించిన మండలాలకు తక్షణమే బడ్జెట్ కేటాయించి రైతులకి సహాయం అందించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు అన్నవరపు కనకయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ములకలపల్లి మండల కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన...
– సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు అన్నవరపు కనకయ్య
ములకలపల్లి, నవంబర్ 19 : రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించిన మండలాలకు తక్షణమే బడ్జెట్ కేటాయించి రైతులకి సహాయం అందించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు అన్నవరపు కనకయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ములకలపల్లి మండల కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని ఎల్ నినో ప్రభావం ఒకవైపు, వరుస తుఫానులతో పంటలు నష్టపోయి రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించిందే కానీ నేటికి కరువు సహాయక చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే అందుకోవాలని డిమాండ్ చేశారు.
మండలంలోని తుఫాను కారణంగా కొట్టుకుపోయిన రహదారులను అదేవిధంగా వీధి రోడ్లను తక్షణమే మరమ్మతులు నిర్వహించాలన్నారు. రైతులందరికీ తక్షణమే బ్యాంకు రుణాలు చెల్లించాలన్నారు. అలాగే 24 గంటల విద్యుత్ సౌకర్యం కల్పించాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేసి దళారుల దోపిడిని నివారించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కారం పుల్లయ్య, పార్టీ మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, కార్యదర్శి వర్గ సభ్యులు పోడియం వెంకటేశ్వర్లు, ఊకంటి రవికుమార్, గౌరీ నాగేశ్వరరావు, మాలోతు రావుజ, నిమ్మల మధు, కుంజా రామ్మూర్తి, కీసరి వెంకట్రావు, గడ్డం వెంకటేశ్వర్లు, గోపగాని లక్ష్మీ నరసయ్య, బైరు ప్రసాద్, రాంబాబు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నేటికి కరువు సహాయక చర్యలు చేపట్టకపోవడం శోచనీయం’
KTR | కాంగ్రేసోళ్లే ఒక్కొక్కరుగా అన్నీ బయటపెడుతున్నరు : కేటీఆర్
TVK MLA VS Babu Dies | స్టాలిన్‌ను ఓడించిన టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు.. అనారోగ్యంతో కన్నుమూత
Orange alert | బంగాళాఖాతంలో కొనసాగుతున్న అక్వాన్ తీవ్ర తుపాను.. ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ
నీటి పారుదలశాఖ మంత్రిగా ఉత్తమ్ అనర్హుడు : మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

