అడ్డుకట్ట వేయకపోతే సింగరేణి కాలనీల్లో పచ్చదనం కనుమరుగు!
ఒకప్పుడు పచ్చదనానికి సింగరేణి కాలనీలు చిరునామాగా ఉండేవి. గతంలో అధికారులు కార్మికుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడంతో కాలనీల్లో ఎక్కడ చూసినా పచ్చని చెట్లు దర్శనమిచ్చేవి. క్వార్టర్ల సంఖ్య కంటే చెట్ల సంఖ్యే ఎక్కువగా ఉండేదంటే పచ్చదనం ఏ స్థాయిలో...
రుద్రంపూర్, నవంబర్ 19 : ఒకప్పుడు పచ్చదనానికి సింగరేణి కాలనీలు చిరునామాగా ఉండేవి. గతంలో అధికారులు కార్మికుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడంతో కాలనీల్లో ఎక్కడ చూసినా పచ్చని చెట్లు దర్శనమిచ్చేవి. క్వార్టర్ల సంఖ్య కంటే చెట్ల సంఖ్యే ఎక్కువగా ఉండేదంటే పచ్చదనం ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో కొందరు వాస్తు పేరుతో, మరికొందరు కోతుల బెడదను కారణంగా చూపుతూ చెట్లను తొలగిస్తున్నారు. సుమారు 20 ఏళ్ల క్రితం నాటిన మొక్కలు నేడు మహా వృక్షాలుగా ఎదిగి పండ్లను అందిస్తున్నప్పటికీ వాటిని విచక్షణారహితంగా నరికివేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ ప్రాంతంలో చెట్ల నరికివేత యథేచ్ఛగా కొనసాగుతోంది. ఇటీవల రుద్రంపూర్ ప్రాంతంలోని ఎన్,సి,ఎన్బి క్వార్టర్లకు కౌన్సెలింగ్ నిర్వహించిన నేపథ్యంలో, క్వార్టర్లు తీసుకున్న కొందరు అక్కడ గత కొన్నేళ్లుగా పెరిగిన చెట్లను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికైనా సింగరేణి పర్సనల్ విభాగం, ఎస్ అండ్ పీసీ సిబ్బంది స్పందించాల్సిన అవసరం ఉంది. క్వార్టర్ల కౌన్సెలింగ్ సమయంలోనే ఎలాంటి, సరైన కారణం లేకుండా చెట్లను నరికితే కఠిన చర్యలు తీసుకుంటామని సంబంధిత వ్యక్తులను హెచ్చరించాలి. అనుమతి లేకుండా చెట్లను తొలగించే వారిపై తగిన చర్యలు తీసుకోవాలి. ఇలాగే ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు చెట్లను నరికివేస్తూ పోతే భవిష్యత్లో కాలనీల్లో పచ్చదనం పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. దీని ప్రభావం పర్యావరణంపై పడటమే కాకుండా భావితరాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా సింగరేణి అధికారులు స్పందించి కాలనీల్లో పచ్చదనాన్ని కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కార్మికులు, పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అడ్డుకట్ట వేయకపోతే సింగరేణి కాలనీల్లో పచ్చదనం కనుమరుగు!
‘నేటికి కరువు సహాయక చర్యలు చేపట్టకపోవడం శోచనీయం’
KTR | కాంగ్రేసోళ్లే ఒక్కొక్కరుగా అన్నీ బయటపెడుతున్నరు : కేటీఆర్
TVK MLA VS Babu Dies | స్టాలిన్ను ఓడించిన టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు.. అనారోగ్యంతో కన్నుమూత
Orange alert | బంగాళాఖాతంలో కొనసాగుతున్న అక్వాన్ తీవ్ర తుపాను.. ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

